Technology: మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ పురోభివృద్ధి అవుతుంది. ఎప్పటికప్పుడు సంస్థలు తమ ఉత్పత్తుల యొక్క ప్రామాణికత, సెక్యూరిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. టెక్నాలజీ ఎంత పెరుగుతున్న అంతే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. టెక్నాలజీ ఉపయోగించుకొని మోసాలు చేయాలని అనుకునేవారు అదే పనిగా ప్రజలు విరివిగా ఉపయోగించే యాప్ లు, సాఫ్ట్ వేర్ లని రకరకాల ఇథికల్ వైరస్ లని ఉపయోగిస్తూ హ్యాక్ చేసేస్తూ రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు.
ఇలాంటి సైబర్ నేరగాళ్ల నుంచి తమ వినియోగదారులని కాపాడుకోవడానికి తమ ప్రోడక్ట్ పై యూజర్స్ నమ్మకాన్ని పెంచడానికి ఆయా కంపెనీలు తమ ప్రోడక్ట్స్ ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ తీసుకొస్తున్నాయి. మరింత అడ్వాన్స్ టెక్నాలజీ తో వినియోగదారులకి దగ్గర కావడానికి యూజర్ ఫ్రెండ్లీగా అప్డేట్స్ ఉండేలా శ్రద్ధ చూపిస్తున్నాయి. కస్టమర్ బేస్ పెంచుకునే మార్గంలో ఎప్పటికప్పుడు మార్పులని తీసుకొస్తూనే ఉన్నాయి.
ప్రపంచంలోనే కాకుండా ఇండియాలో అత్యధిక యూజర్ బేస్ ఉన్న సోషల్ మీడియా మెసెంజర్ యాప్ వాట్సా యాప్ తన సాంకేతికని మరింత అడ్వాన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపధ్యంలో ఇప్పటికప్పుడు వాట్స్ యాప్ అప్డేట్స్ లో కొత్త కొత్త మార్పులు గమనిస్తూనే ఉన్నాం. అయితే త్వరలో వాట్స్ యాప్ కొంతమంది ఐవోఎస్ వినియోగదారులకి తమ సేవలని నిలిపివేయాలని భావిస్తుంది.
ముఖ్యంగా పాత ఐఫోన్ మోడల్స్ వాడే వారికి త్వరలో వాట్స్ యాప్ సేవలు ఆగిపోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కంపెనీ కీలక ప్రకటన కూడా చేసింది. ఈ ఏడాది చివరినాటికి ఐవోఎస్ 10, ఐవోఎస్ 11 వెర్షన్స్ ఉన్న ఐ ఫోన్ లకి వాట్సాప్ మెసెంజర్ యాప్ పనిచేయదని స్పష్టం చేసింది. కంపెనీ ప్రకటన నేపధ్యంలో పాత ఐఓఎస్ వెర్షన్స్ కలిగి ఉన్న ఐఫోన్ వినియోగదారులు తమ ఫోన్ లని వీలైనంత వేగంగా అప్డేట్ చేసుకోవాల్సిందే. లేదంటే కొత్త ఫోన్ లకి మారాల్సిందే.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.