Health Tips: మన రోజువారి ఆహారపు అలవాట్లు జీవన విధానాల కారణంగా ప్రస్తుత జీవితంలో చిన్న వయసులోనే అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఉబకాయం, బిపి, డయాబెటిస్ లాంటి వ్యాధులు ఎక్కువగా ప్రస్తుతం ప్రజలను భయపెడుతున్నాయి. ఆహారపు అలవాటులో మార్పుల కారణంగా అలాగే మార్కెట్లో దొరికే ప్యాకేజ్ ఫుడ్స్ కారణంగా ఎక్కువగా ప్రజలు ఇలా రోగాల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే దయనందిన జీవితంలో చాలా మంది ఆహారపు అలవాట్ల విషయంలో పెద్దగా మార్పు ఉండడం లేదు. ఈ కారణంగానే 50 ఏళ్లు రాకుండానే చాలామంది డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు.
ఇండియాలో 2022 లెక్కల ప్రకారం 80 మిలియన్స్ ప్రజలు డయాబెటిస్ బారిన పడినట్లుగా అంచనా వేస్తున్నారు. 2045 నాటికి ఈ డయాబెటిస్ రోగుల సంఖ్య 135 మిలియన్స్ కి చేరుతుందని భావిస్తున్నారు ప్రస్తుత ఇండియా జనాభాలో 17% మంది డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఓ విధంగా ప్రపంచాన్నే కాకుండా ఇండియాని కూడా ఈ డయాబెటిస్ భయపెడుతుంది అని చెప్పాలి. అయితే డయాబెటిస్ మనిషిని చంపేసే అంత ప్రమాదకరమైన వ్యాధి అయితే కాదు. కానీ ఒక్కసారి ఈ వ్యాధి బారిన పాడిన తర్వాత కచ్చితంగా ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు చేసుకోవాల్సిందే.
లేదంటే తొందరగా మనిషిని శారీరకంగా డయాబెటిస్ బలహీనంగా మార్చి మరణానికి దగ్గర చేస్తుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు కచ్చితంగా కొన్ని ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. అయితే కొన్నింటిని మాత్రం తినడం ద్వారా డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. పండ్లను తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని చాలామంది భావిస్తారు. అలాగే షుగర్ వ్యాధి పెరగడానికి కారణమయ్యే అన్నం ఇడ్లీ వంటివి తింటూ ఉంటారు. అయితే ఈ విషయంలో ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
బొప్పాయి, కర్బూజా, జామ, పుచ్చకాయ, కమలా, పైనాపిల్, యాపిల్, నేరేడు, రేగి పండ్లు తినడం వలన షుగర్ వ్యాధి పెరగకుండా అదుపులో ఉంటుందని చెబుతున్నారు. ఈ పండ్లలో ఉండే చక్కెరలు ప్రక్టోజ్ రూపంలో ఉండడం వలన శరీరానికి హానికరం కాదని సూచిస్తున్నారు. అలాగే జన్యు పరంగా కూడా ఈ షుగర్ డయాబెటిస్ వ్యాధి సంక్రమించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆహార పదార్థాలు తీసుకునే కచ్చితంగా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.