Categories: InspiringLatestNews

Spiritual: కామదహనం గురించి మీకు తెలుసా?

Spiritual: మన భారతీయ హిందూ మత ఆచారాలలో ఎన్నో పండుగలు ఉన్నాయి. అలాగే ప్రతి పండుగ వెనుక ఒక విశేషమైన కారణం ఉంటుంది. ఆ కారణాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అయితే ఈ కారణాలని కొంత మంది మూఢ నమ్మకాలు అని కొట్టిపారేసిన వాటి వెనుక బలమైన శాస్త్రీయ సంబంధ నిజాలు ఉంటాయని హిందువులు బలంగా నమ్ముతూ ఉంటారు. అందుకే హిందువుల తమ మత విశ్వాసాలని కచ్చితంగా విశ్వసిస్తూ ఉంటారు.  ఇలా హిందూ ఆచార వ్యవహారాలలో భాగమైన పండుగలలో హోలీ కూడా ఒకటి. అయితే ఈ హోలీ పండుగ అంటే అందరూ రంగులు జల్లుకోవడం అని అనుకుంటారు.

what-is-the-behind-story-of-the-holi

నిజానికి హోలీ రోజున పెద్ద పెద్ద మంటలు వేసి కామదహనం వేడుక నిర్వహిస్తారు. అలాగే హోలిక దహనం కూడా చేస్తారు. ఉదయాన్నే కామదహనం వేడుక ఉంటే చీకటి పడిన తర్వాత హోలికా దహనం ఉంటుంది. నిజానికి ఇదే అసలైన హోలీ పండుగ అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కామదేవుడు అయిన మన్మధుడు మహాశివుడిపై మన్మధ బాణం వేసి అతని తపస్సుని భగ్నం చేస్తాడు. దీనికి కోపంతో శివుడు కామదేవుడిని దగ్ధం చేశాడు. అయితే అతని భార్య రతీదేవి అభ్యర్ధన మేరకు తిరిగి బ్రతికిస్తాడు. అయితే అంత వరకు మొహం సమ్మోహనంతో ఉన్న కామదేవుడిని ప్రేమపూర్వకమైన మన్మధుడిగా మహాశివుడు మారుస్తాడు.

what-is-the-behind-story-of-the-holi

అందుకే ఆ రోజున మనలో ఉన్న కామాన్ని దహనం చేయాలని సూచిస్తూ ఈ భోగి మంటలు లాంటివి వేసి కామదహనం చేస్తారు. అలాగే హిరణ్యకశిపుడు చెల్లెలు అయిన హోలిక సహారంకి ప్రతీకగా కూడా హోలికా దహనం అనే వేడుక నిర్వహిస్తారు. అలాగే హిరణ్యకశిపుడుని నరసింహుడు సంహరించి ప్రజలకి అతని బాధల నుంచి విముక్తి కల్పించినందుకు హోలీ సంబరాలు చేసుకుంటారు. ఇలా మన సనాతన ధర్మంలో హోలీ వేడుకకి, కామ దహనంకి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఈ హోలీ ఫెస్టివల్ ని ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువగా జరుపుకుంటారు. ముఖ్యంగా గుజరాత్, యూపీలో ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరుగుతుంది. మార్చి 7న ఈ ఏడాది హోలీ పండుగని ప్రజలు జరుపుకోవడానికి సిద్ధం అవుతున్నారు.

Varalakshmi

Recent Posts

Kollywood: ఓం రివ్యూ- ధనుష్, సాయిపల్లవి మూవీ మెప్పించిందా?

మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…

1 day ago

Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…

2 days ago

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

2 weeks ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

2 weeks ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

2 weeks ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

This website uses cookies.