Health Tips: సాధారణంగా మన భారతీయ వంటలలో ఎన్నో సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తూ ఉంటాము. అలాంటి సుగంధ ద్రవ్యాలలో యాలకులు ఒకటి. ఈ యాలకులను మనం ఎన్నో రకాల వంటలలోను సుగంధ ద్రవ్యాలలోను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము అయితే వీటిని వేయటం వల్ల ఆహారానికి రుచి మాత్రమే కాకుండా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని చెప్పాలి. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి యాలకులు చాలామంది ప్రతిరోజు ఉదయం నీటిలో మరిగించి ఆ నీటిని తాగుతూ ఉంటారు ఇలా తాగటం మంచిదేనా తాగటం వల్ల ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే..
ఏలకులు శ్వాసను తాజాగా ఉంచుతాయి. కూరల నుండి బేకింగ్ వరకు.. ఏలకులను అనేక వంటలలో కూడా ఉపయోగిస్తారు. అయితే ప్రతిరోజు వీటిని మరిగించి ఆ నీటిని తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేవగానే యాలకుల నీళ్లు తాగడం వల్ల శరీరంలోని జీవక్రియలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఏలకుల నీరు కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. పొత్తికడుపు, శరీరంలోని ఇతర భాగాలలో కొవ్వు పేరుకుపోకుండా చేయడమే కాకుండా రక్తప్రసరణ వ్యవస్థను పెంచుతూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఏలకులలోని పోషక గుణాలు శరీరంలోని చెడు కొవ్వును పోగొట్టడంలో సహాయపడతాయి. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఏలకులు ప్రభావవంతంగా ఉంటాయి. ఇక రక్తంలోనే చక్కర స్థాయిలను అదుపులో ఉంచడానికి కూడా ఇవి ఎంతగానో దోహదపడతాయి అందుకే ప్రతిరోజు ఒక చిన్న గ్లాస్ ఏలకులు మరిగించిన నీటిని తీసుకోవడం ఎంతో మంచిది. ఇక చాలామంది వీటిని మౌత్ ఫ్రెషనర్ గా కూడా ఉపయోగిస్తారు వీటిని తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి నోటి దుర్వాసన ఉండదు.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.