Health: వేసవికాలం వచ్చేస్తుంది. అయితే ఈ కాలంలో విపరీతమైన ఎండ వేడిమి కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. డిహైడ్రేషన్ ఎక్కువగా గురవుతూ ఉంటారు. ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతూ ఉండడం కారణంగా ఎండలో తిరగాలంటే కష్టంగా ఉంటుంది. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం మన జీవన శైలిలో కూడా మార్పులు వచ్చాయి. ఇప్పటికి కరోనా వ్యాక్సిన్ కారణంగా ఎక్కువమంది ఇతర అనారోగ్యాల బారిన పడుతున్నారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి క్షీణించి మందులపైన ఆధారపడిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో శారీరకంగా వేసవిలో మరింత అలసటకు గురయ్యే అవకాశం కచ్చితంగా ఉందని చెప్పాలి. అయితే వేసవి కాలంలో ఎండ వేడి నుంచి కాస్త ఉత్సాహం కలిగించేది వాటర్ మిలన్.
ఎక్కువ మంది వేసవికాలంలో ఈ పుచ్చకాయలు తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే పుచ్చకాయను తినే క్రమంలో గింజలను పారేయడం అలవాటుగా మారిపోయింది. కానీ పుచ్చకాయతో పాటు అందులో ఉండే గింజలకి కూడా అత్యధిక పోషక విలువలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పుచ్చకాయ విత్తనాలలో విటమిన్లు, జింక్ మెగ్నీషియం, పొటాషియం వంటి మూలకాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. పుచ్చకాయ విత్తనాలు తీసుకోవడం వల్ల శరీరంలో మెగ్నీషియం, విటమిన్ సి సమృద్ధిగా పెరిగి యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేస్తాయి. ఇవి చర్మానికి నిగారింపు నివ్వడంతో పాటు, మొటిమలు, వృద్ధాప్య సమస్యలని దూరం చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.
అలాగే ఈ విత్తనాలలో ప్రోటీన్లు, ఐరన్, మెగ్నీషియం, జింక్, రాగి వంటి పోషక విలువలు ఉన్న పదార్థాలు ఉంటాయి. ఇవి జుట్టు రాలిపోకుండా కాపాడటంతో పాటు, డాండ్రఫ్ సమస్యను దూరం చేస్తాయి. అలాగే ఈ విత్తనాలలో బీపీని కంట్రోల్లో ఉంచే మోనో అన్సాచ్యురేటెడ్, పాకి అన్సాచ్యురేటెడ్ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయని చెప్తున్నారు. అలాగే వాటర్ మిలన్ షీడ్స్ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని వైద్యుల మాట. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంచడం కూడా ఈ గింజలు సమృద్ధిగా పనిచేస్తాయి. పురుషులలో స్పెర్మ్ కౌంట్ పెరగడానికి అద్భుతమైన ఔషధంగా ఇవి పనిచేస్తాయి. అలాగే జీవక్రియలను మెరుగుపరిచే పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.