Vyuham : వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సెన్సేషనే అనే విషయం అందరికీ తెలిసిందే. కాంట్రవర్సీ సినిమాలు తీయడమే కాదు..నిర్మొహమాటంగా ఏది అనుకుంటే అది మాట్లాడుతూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. లేటుస్టుగా ఆర్జీవీ వ్యూహం అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి హాట్ టాపిక్ గా నలిచింది. వ్యూహాన్ని అడ్డుకునేందుకు అటు టీడీపీ నేతలు చేయని ప్రయత్నం అంటూ లేదు. జనసేన, టీడీపీ నాయకుల మధ్య గత కొంత కాలంగా మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా మూవీ విడుదల నేపథ్యంలో అమరావతి ఉద్యమ నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు.. వర్మ తల నరికి తీసుకొచ్చిన వారికి కోటి ఇస్తానంటూ ప్రకటించడంతో పెద్ద దుమారం రేగింది. దీంతో రామ్ గోపాల్ వర్మ్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో వ్యూహం విడుదల సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే వ్యూహం విషయంలో ఆర్జీవీ ప్లాన్ బెడిసికొట్టినట్లైంది. తానొకటి తలిస్తే మరొకటి జరిగింది. తాజాగా రామ్ కి తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ సడెన్ షాక్ ఇచ్చింది. వచ్చే సంవత్సరం జనవరి 11 వరకూ సినిమా రిలీజ్ ను నిలిపేస్తూ ఆదేశాలు ఇచ్చింది. వ్యూహం మూవీలో అభ్యంతరకర సీన్స్ ఉన్నాయని న్యాయస్థానం తేల్చేసింది. అంతే కాదు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్‌ని రద్దు చేసింది. దీంతో లెక్క ప్రకారం ఇవాళ థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమాకు బ్రేక్ పడింది. సినిమా వాయిదా పడింది.
ఆర్జీవీ మొదటి నంచి కాంట్రవర్సీలకు చాలా దగ్గరగా ఉంటూ ఉంటారు. ఆయన సినిమాలు ఎక్కువగా పొలిటికల్ సెటైర్ గా ఉంటాయి. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ టీడీపీ అధినేత చంద్రబాబును, టీడీపీ నేతలను టార్గెట్ చేసి సినిమాలు తీశాడు. తాజాగా టీడీపీ, జనసేనను టార్గెట్ చేస్తూ వ్యూహం అనే సినిమాను రూపొందించారంటూ ఆ రెండు పార్టీల నేతలు , కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ చిత్రం విడుదలను ఆపాలని టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు , టీడీపీ నేత నారా లోకేష్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇవాళ కోర్టులో ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. విచారణ జరిపిన హైకోర్టు ఆర్జీవీకి షాక్ ఇచ్చింది. వ్యూహం విడుదలను టెంపరరీగా ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు తీర్పుపై వ్యూహం మేకర్స్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత హైకోర్టు జోక్యం సరికాదని అంటున్నారు.
ఇదిలా ఉంటే వ్యూహం మూవీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రతిష్టను దెబ్బతీసేదిలా ఉందని, ఆర్జీవీ కావాలనే , ఉద్దేశ పూర్వగంగానే ఈ సినిమా తీశారడి వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో ఏపీ ముఖ్యమంత్ర జగన్ మొహన్ రెడ్డి.. ఎలా అధికారంలోకి వచ్చారు? ఎలాంటి వ్యూహం రచించారు అన్నది కీలకాంశంగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాను వైసీపీ వర్గాలు సమర్థిస్తుంటే. టీడీపీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో ఈ వ్యూహం సినిమాను రూపొందించారు. ముఖ్యంత్రి వైఎస్ జగన్ క్యారెక్టర్ లో అజ్మల్ నటించగా.. వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. ఈ సినిమా రిలీజ్ కు ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో బ్రేకులు పడుతున్నాయి. మరి వ్యూహం జనవరి 11 తర్వాతైనా విడుదల అవుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.