Categories: EntertainmentLatest

VN Aditya : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం..కారణం తెలిస్తే షాకే

VN Aditya : ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. తను డైరెక్ట్ చేసిన మూడు సినిమాలను రిలీజ్ చేయకుండా సంస్థ గత నాలుగేళ్లుగా ఆలస్యం చేస్తోందని ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ “మిస్టర్ బచ్చన్,” “విశ్వం,” “మా కాళి,”, “స్వాగ్”తో సహా తమ అప్‌కమింగ్ సినిమాల గురించి చర్చించిన మీటింగ్ నుంచి ఒక ఫోటోను షేర్ చేసి మరీ ఆదిత్య ఆగ్రహం వ్యక్తం చేశారు. “నా మూడు సెన్సిబుల్, విలువైన సినిమాలు ఈ సంస్థ ద్వారా విడుదల అవుతాయని నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నాను. మీ కంపెనీ పెద్దలు నా సినిమాల విడుదల గురించి అర క్షణం ఆలోచిస్తే సరిపోతుంది. నేను సహనం కోల్పోయా. అందుకే ఇలా అడగాల్సి వస్తోంది.”అని ఫేస్‌బుక్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కాస్త ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

vn-aditya-tollywood-director-angry-on-people-media-factory

అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీమ్, డైరెక్టర్ ఆదిత్య సినిమాలను ఎందుకు రిలీజ్ చేయడం లేదు అనేదానిపై సరైన కారణాలు తెలియ రాలేదు. కానీ దర్శకుడిని మాత్రం బాగా ఇబ్బంది పెడుతున్నట్లు ఆయన పేస్ బుక్ పోస్ట్ ద్వారా అర్థమవుతుంది. ఆయన డైరెక్ట్ చేసిన లవ్ @ 65, మర్యాద కృష్ణయ్య, మీరెవరు వంటి మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికి ఏళ్లకు ఏళ్లు జాప్యం చేయడంతో ఆయన బహిరంగంగానే ఆ సంస్థపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ సినిమాలను ప్రొడక్షన్ హౌస్ విడుదల చేస్తుందని ఆశిస్తూ దర్శకుడి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

vn-aditya-tollywood-director-angry-on-people-media-factory

వి.ఎన్ ఆదిత్య తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడిగానే కాకుండా స్క్రీన్ రైటర్‌గా కూడా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని థియేటర్లలో 200 రోజుల పాటు దిగ్విజయంగా ఆడిన “మనసంతా నువ్వే” సినిమా డైరెక్ట్ చేసి ఆదిత్య మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నేనున్నాను అనే ఎమోషనల్ సినిమాతో మరోసారి మంచి హిట్ సాధించారు. “బాస్” మూవీ తో కూడా విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆయన ఒక్క మూవీ కూడా కమర్షియల్ సక్సెస్ కాలేదు.

vn-aditya-tollywood-director-angry-on-people-media-factory

2011 తర్వాత ఆయన తెలుగు సినిమాలే చేయలేదు. 2018లో ఒక ఇంగ్లీష్ సినిమా తీశారు దానివల్ల వచ్చిన గుర్తింపు ఏమీ లేదు. తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మూడు సినిమాలు తీశారు ఆదిత్య. అయితే ఆ సినిమాలేవి ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. కార్తికేయ 2, వెంకీ మామ, నిశ్శబ్దం, ఓ బేబీ, ధమాకా వంటి సినిమాలతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ గా అవతరించింది. మరి ఇలాంటి వీరిపై ఆరోపణ రావడం దానికి ఒక చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉందని సినీ నిపుణులు అంటున్నారు.

Sri Aruna Sri

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

2 weeks ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

2 weeks ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

2 weeks ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

2 weeks ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

2 weeks ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

3 weeks ago

This website uses cookies.