Vizag: ఆ మధ్య ఢిల్లీలో గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ ఏపీ రాజధాని విశాఖపట్నం అని, తాను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతున్న అంటూ సంచలన కామెంట్స్ చేశారు. మొన్నటి వరకు మూడు రాజధానులు అంటూ హడావిడి చేసి ఒక్కసారిగా ఏపీకి ఒకటే రాజధాని అది విశాఖపట్నం మాత్రమే అని చెప్పడం ద్వారా వైసీపీ స్టాండ్ మారిందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా బెంగుళూరులో పెట్టుబడిదారుల సదస్సులో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఐటీ మంత్రి అమర్నాథ్, ఆర్ధిక మంత్రి బుగ్గన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సెమినార్ లో ఏపీకి మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ లేదని, కేవలం విశాఖపట్నం మాత్రమే రాజధాని అని చెప్పారు. అమరావతిలో కేవలం ఏడాదిలో ఒకసారి అసెంబ్లీ సమావేశాలు మాత్రమే జరుగుతాయని తెలిపారు. అలాగే కర్నూల్ లో ఏర్పాటు చేసేది హైకోర్టు బెంచ్ మాత్రమే అని చెప్పారు. విశాఖపట్నం నుంచి ప్రభుత్వం పరిపాలన మొదలుపెడుతుంది అని క్లారిటీ ఇచ్చారు. అక్కడ పెట్టుబడులు పెట్టడానికి కావాల్సినంత ప్రభుత్వ భూమి ఉందని దానిని ఇస్తామని కూడా బుగ్గన, అమర్ నాథ్ తెలియజేశారు.
అలాగే మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం ప్రైవేట్ పరిశ్రమలకి అన్ని విధాలుగా సహకారం అందిస్తుంది అని తెలిపారు. ఇదిలా ఉంటే బుగ్గన చేసిన కామెంట్స్ ద్వారా మూడు రాజధానులు అంటూ వైసీపీ సర్కార్ ఇన్ని రోజులు ప్రజలని మోసం చేస్తూ వస్తుందనే ప్రచారాన్ని ప్రతిపక్షాలు తెరపైకి తీసుకొచ్చాయి. వారి దృష్టి అంతా విశాఖపట్నం మీదనే ఉందని, అక్కడి ప్రకృతి వనరులని ద్వంసం చేసి దోచుకోవడానికి రాజధానిగా మారుస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇన్ని రోజులు వారు చెప్పిన మాటని మళ్ళీ వారే అబద్ధం అని క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. అయితే మూడు రాజధానులు అంటూ మభ్య పెట్టిన వైసీపీకి ఇప్పుడు ఒకే రాజధాని అని చెప్పడం ద్వారా కచ్చితంగా రాయలసీమ, పల్నాడు ప్రాంతాలలో ఎఫెక్ట్ పడే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.