Menstrual cramps: అమ్మాయిలు ప్రతినెల నెలసరి సమయంలో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. నెలసరి అనేది అమ్మాయిల జీవితంలో జరిగే ఒక సహజ ప్రక్రియ. ఇలా ప్రతినెల నెలసరి కారణంగా అమ్మాయిలు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. నెలసరి సమయంలో తీవ్రమైన వెన్నునొప్పి కడుపునొప్పి వంటి సమస్యలు అమ్మాయిలను వేధిస్తూ ఉంటాయి. అయితే ఇలా నెలసరి సమయంలో ఈ విధమైనటువంటి నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే విటమిన్ లోపం కారణంగా కూడా ఇలాంటి నొప్పి వస్తుందని గైనకాలజిస్టులు తెలియచేస్తున్నారు.
సాధారణంగా నెలసరి సమయంలో నొప్పి రావడానికి అండాశయాల్లో సిస్టులు, పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్, అడెనోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్ వంటివి ప్రధాన కారణాలు కావచ్చు. వీటితో పాటు ఆహారంలో కొన్ని పోషకాలు తక్కువగా ఉండటం వల్ల కూడా ఈ విధమైనటువంటి నొప్పి ఉంటుందని తెలుస్తోంది. శరీరంలో విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉంటే పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి ఎక్కువగా ఉంటుంది.విటమిన్ డి శరీరంలోని వాపును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే పీరియడ్స్ సమయంలో గర్భాశయం సంకోచించడానికి కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ వంటి రసాయనాల నియంత్రణలో కూడా ఇది పాత్ర పోషిస్తుంది.
విటమిన్ బి1 లేదా థయామిన్ లోపం నేరుగా పీరియడ్స్ నొప్పికి కారణమవుతుందని చెప్పలేం. అయితే ఇది కండరాల పనితీరు, నరాల సంకేతాలపై ప్రభావం చూపవచ్చు.విటమిన్ ఈ లోపం నేరుగా పీరియడ్స్ నొప్పికి కారణం కాకపోయినా, శరీరంలో వాపు పెరగడానికి దారితీయవచ్చు. మెగ్నీషియం లోపం కారణంగా కూడా నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. గర్భాశయంలో జరిగే మార్పులు మాత్రమే కాకుండా పోషకాహార లోపం కారణంగా కూడా నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది .తద్వారా కళ్ళు తిరగడం, నీరసించి పోవడం, అలసట రావడం, వెన్ను నొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.