Vishwambhara : టాలీవుడ్‌లోని సీనియర్ హీరోల ట్రెండ్ నడుస్తోంది. విక్టరీ వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్స్ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. మెగాస్టార్ కూడా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసపెట్టి క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ తన అభిమానులను అలరిస్తున్నారు. గత ఏడాది నటించిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ అందుకోగా , భోలా శంకర్ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు మెగాస్టార్. అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మంచి జోష్ లో ఉన్నారు. లేటెస్టుగా ఆయన విశ్వంభర సినిమాతో మరోసారి స్క్రీన్ మీద సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కబోతోంది. షూటింగ్ కూడా ఈ ప్రారంభం అయ్యింది. మరో వారంలో హీరో షెడ్యూల్ ఉండటంతో ఫిజికల్ ఫిట్ నెస్ మీద దృష్టి కూడా పెట్టారు మెగాస్టార్. జిమ్ లో వర్కౌట్లు కూడా ప్రారంభించారు.
‘భోళా శంకర్’ డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ బద్దలుకొట్టాలన్న కసితో ఉన్నారు. అందుకే బింబిసారతో హిట్ సాధించిన డైరెక్టర్ వశిష్టతో మూవీకి రెడీ అయ్యారు. 156వ సినిమాగా చిరంజీవి విశ్వంభర చేస్తున్నారు. ‘విశ్వంభర’ సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతోందని సమాచారం. కాన్సెప్టు పోస్టర్, గ్లింప్స్ లోనూ మేకర్స్ అదే చూపించారు. పలు షెడ్యూళ్లను కూడా కంప్లీట్ చేసుకున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ మూవీలో నటించే యాక్టర్స్ పై ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ, హీరో చిరంజీవి అని తెలుసు కానీ ఇందులో హీరోయిన్ ఎవరా అనేది మాత్రం తెలియలేదు. అయితే విశ్వంభరలో చిరంజీవి సరసన త్రిష నటించబోతోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ల పేర్లు కూడా చర్చకు వచ్చాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ‘విశ్వంభర’లో ఓ కీలకమైన క్యారెక్టర్ గురించి ప్రస్తుతం తాజా అప్ డేట్ వచ్చింది. టాలీవుడ్ లక్కీ లేడీగా తమిళ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రను చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈమె సెలక్ట్ అయినట్లు కన్ఫార్మేషన్ వచ్చింది. త్వరలోనే షూటింగ్‌లో కూడా పాల్గొననుంది. హనుమాన్ చిత్రంలో హీరో తేజ్ సజ్జాకు అక్క పాత్రలో నటించి దేశవ్యాప్తంగా మరింత క్రేజ్ సంపాదించు కుంది వరలక్ష్మీ. దీంతో ఈ భామ టాలీవుడ్ లో లక్కీ లేడీగా మారింది. అందుకే విశ్వంభర టీమ్ కూడా ఈ హిట్ సెంటిమెంట్ ను వర్కౌట్ చేద్దామని ఆమెను ఎన్నుకుంది. ఈ సినిమాలో వరలక్ష్మీ క్యారెక్టర్ గత చిత్రాల మాదిరిగానే మ్యాజిక్ చేసేలా ఉంటుందని టాక్. దీంతో ఈ మూవీకి కూడా హిట్ పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.