Vijay-srileela : విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో ఈ పేరుకు మంచి బ్రాండ్ ఉంది. అమ్మాయిలు ఈ పేరు వింటే చాలు ఫుల్ ఎగ్జైటెట్ గా ఫీల్ అవుతారు. మొదటి సినిమా నుంచి తన యాటీట్యూడ్ , నటనతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు విజయ్. మరీ ముఖ్యంగా తెలుగు అమ్మాయిల క్రేజీ హీరోగా ఫేమస్ అయ్యాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రౌడీ బాయ్ కి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సందీప్ రెడ్డి వంగ రూపొందించిన అర్జున్ రెడ్డి మూవీతో విజయ్ క్రేజ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా సినిమాలు చేస్తూ తన అభిమానులను అలరిస్తున్నాడు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా కెరీర్ లో బ్రేకులు వేయకుండా ముందుకెళ్తున్నాడు. లైగర్ ఫ్లాప్ తర్వాత నటించిన ఖుషి మూవీ మంచి హిట్ సాధించడంతో ఇప్పుడు వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అయ్యాడు.
ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ లో నటిస్తున్నాడు విజయ్. ఈ మూవీ తర్వాత జెర్సీ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో మరో మూవీ చేయబోతున్నాడు. అయితే తాజాగా ఈ మూవీ గురించి షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. గౌతమ్ తో చేసే ఈ సినిమా విజయ్ దేవరకొండకు 12వ సినిమా. దీంతో దీనికి వర్కింట్ టైటిల్ వీడీ12 అని పెట్టారు. అలాగే ఈ మూవీలో ముందుగా హీరోయిన్ గా టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరోయిన్, శ్రీలీలను తీసుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నుంచి అమ్మడు తప్పుకున్నట్లు తెలుస్తోంది. అందుకు ఫ్యామిలీ స్టార్ మూవీ కారణమని టాక్ వినిపిస్తోంది.
గీతాగోవిందం మూవీ డైరెక్టర్ పరుశురాం ఫ్యామిలీ స్టార్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా సీతారామమ్ ఫేమ్ మృణాల్ హీరోయిన్ గా కనిపించనుంది. ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూజర్ దిల్ రాజ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఫ్యామిలీ స్టార్ మూవీ పూర్తికాగానే VD12 షూట్ స్టార్ట్ చేయాలని మేకర్స్ భావించారు.కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పటికీ ఫ్యామిలీ స్టార్ మూవీ షూటింగ్ పూర్తికాలేదు. ఈ క్రమంలో ఫ్యామిలీ స్టార్ పూర్తైన తర్వాతే VD12 చేద్దామని విజయ్ చెప్పడంతో డైరెక్టర్ గౌతమ్ కూడా ఓకే అన్నాడట. అయితే షూటింగ్ ఆలస్యం అవడంతో.. శ్రీలీల తన డేట్లను అడ్జస్ట్ చేసుకోలేక పోతోందట. అందుకే VD12 నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మేకర్స్ కూడా ఓకే చెప్పడంతో ఇప్పుడు రెండో హీరోయిన్ కోసం వేట మొదలైంది. ఈ క్రమంలో యానిమల్ మూవీ బ్యూటీ తృప్తి దిమ్రిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. యానిమల్ లో తృప్తి తన యాక్టింగ్ తో అదరగొట్టింది. ఈ ఒక్క మూవీతో అమ్మడికి ఓ రేంజ్ పాపులారిటీ వచ్చింది. సోషల్ మీడియాలోనూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ క్రమంలో ఆమెనే విజయ్ సినిమాలో రెండో హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారట. తృప్తి కూడా ఓకే చెబితే రౌడ్ బాయ్ జోడీగా ఈ ముద్దుగుమ్మను మనం చూడవచ్చు.
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.