Categories: LatestNews

Smart phone : రూ.50 వేల లోపు అత్యంత సన్నని ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ ఇది.

Smart phone : మోటోరోలా ఇటీవల భారతదేశంలో తన కొత్త ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా ఎడ్జ్ 30 ఫ్యూజన్‌ను విడుదల చేసింది. కొత్త ఫ్లాగ్‌షిప్ కిల్లర్ గా పేర్కొనబడిన మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్, ఎడ్జ్ 30 ప్రో కింద , ఎడ్జ్ 30 అల్ట్రా టాప్-ఆఫ్-ది-లైన్ లో ఉంటుంది. అధిక మొత్తంలో ఖర్చు చేయకుండా ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ పనితీరును అనుభవించాలనుకునే కొనుగోలుదారులను లక్ష్యంగా మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ను మార్కెట్ లో తీసుకొచ్చారు.

మోటరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ప్రీమియం డిజైన్ మంచి ఫీచర్లను కలిగి ఉంది. ఇది కేవలం ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ పనితీరును అందించడమే కాదు, రూ. 50 వేల లోపు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుంది. భారతదేశంలో ఒకే స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో మోటరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ను విడుదల చేశారు. 8GB RAM , 128GB స్టోరేజ్ కెపాసిటీ తో ఉన్న ఫోన్ ధర రూ.42, 999. కాస్మిక్ గ్రే , సోలార్ గోల్డ్ రంగుల్లో మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి.

ICICI బ్యాంక్ , యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై వినియోగదారులు 10 శాతం తగ్గింపును పొందవచ్చు. మోటరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ హ్యాండ్ ఫీల్ ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ . ఈ మొబైల్ బ్లాక్ ఎడ్జేస్ తో చాలా హ్యాండీగా ఉంటుంది. అల్యూమినియం బాడీ ఫ్రేమ్ తో, సేఫ్ అండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. మోటరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ మొబైల్ ను ప్రీమియం మెటీరియల్స్‌తో తయారు చేశారు. 4400mAh బ్యాటరీతో నిర్మించిన ఫోన్ ఇది. 179g బరువుతో చాలా తేలికగా ఉంటుంది. 7.45mm స్లిమ్‌గా ఉంటుంది. మోటరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ భారతదేశంలోని అత్యంత సన్నని ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌లలో ఒకటిగా నిలుస్తోంది.

కాస్మిక్ గ్రే రంగులో వచ్చిన మొబైల్ దూరం నుండి కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. మరింత మెరిసే రంగును కోరుకునే వారు సోలార్ గోల్డ్ ను ఎంచుకోవచ్చు. వెనుక గ్లాస్ మట్టే టెక్చర్ కలిగి ఉంది. నీరు , దుమ్ము నుండి రక్షణ కల్పించే విషయంలో ఈ ఫోన్ కు IP52 రేట్ ఇచ్చారు. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ లేదు, కానీ ఈ ఫోన్ స్టీరియో స్పీకర్ సెటప్‌ను అందిస్తుంది. ప్రైమరీ స్పీకర్ గ్రిల్ USB టైప్-C పోర్ట్ దిగువన SIM ట్రే పక్కన ఇచ్చారు. సెకండరీ అవుట్‌లెట్‌ లో స్టీరియో సౌండ్ ఇచ్చారు. కుడి వైపున ఉన్న పవర్ వాల్యూమ్ బటన్‌లు సులభంగా చేరుకోవచ్చు .

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Virinchi Varma: ‘జితేందర్ రెడ్డి’ సినిమా అందుకే చేశాను..

Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…

1 day ago

Raashii Khanna: అది నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..?

Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…

1 week ago

Tollywood: కాంబో ఫిక్స్..కానీ కథే కుదరలా..?

Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…

2 weeks ago

SSMB29: జనవరి నుంచి వచేస్తున్నాం..

SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…

2 weeks ago

The Raja Saab: ప్రభాస్ లుక్ చూస్తే రజినీకాంత్ గుర్తొస్తున్నారా..?

The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…

2 weeks ago

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ..

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…

2 weeks ago

This website uses cookies.