Venu Swamy: సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు తారలు, రాజకీయ నాయకులతో పాటుగా ఇతర ప్రముఖుల గురించి అలాగే అనేక అంశాల మీద జ్యోతిష్యం చెప్తూ ఎంతో పాపులర్ అయ్యారు వేణుస్వామి. ఈయన చెప్పిన జ్యోతిష్యుం చాలా వరకూ నిజమయింది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగానూ ఆయనకు అసాధారణమైన పాపులారిటీ వచ్చింది.
ఈ క్రేజ్ కారణంగానే 2024 లో వేణు స్వామి వైఎస్ జగన్ గెలుస్తారని చెప్పారు. కానీ అది జరగలేదు. దాని తర్వాత సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం మానేస్తానని ఒక సంచలన ప్రకటన చేయడం అందరికీ తెలిసిందే. ఈ మేరకౌ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
Venu Swamy: తర్వాత ఈ పాపులర్ ఆస్ట్రాలజర్ కనిపించకపోయినా సరే, యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఆయన గురించే వీడియోలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పోస్ట్‌లు, మీమ్స్ అన్నీ హల్చల్ చేస్తున్నాయి. అయితే వేణు స్వామి ఇంటర్నెట్ యూజర్లకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నా వారు మాత్రం ఆయన్ను వదలడం లేదు. ఆయనకు ఉన్న ఈ క్రేజ్‌ని బిగ్ బాస్ టీం గుర్తించినట్లు ఉంది. అందుకే, నెక్స్ట్ సీజన్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. వేణు స్వామి కోసమైనా చాలామంది ప్రజలు టీవీలకు అతుక్కుపోతారని..విపరీతంగా టీఆర్పీ రేటింగ్ వస్తుందని బిగ్ బాస్ నిర్వహకులు నమ్ముతున్నారట. ఆ కారణం చేతే ఆయనను సంప్రదించారని, బిగ్ బాస్ లో పాటిస్పేట్ చేయడానికి వేణు స్వామి కూడా ఒప్పుకున్నారని టీవీ సర్కిల్ లో ప్రచారం జోరుగా సాగుతోంది.
అంతేకాదు, ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఏ సెలబ్రిటీ తీసుకొని పారితోషికం వేణు స్వామి తీసుకుంటున్నారట. మొదటగా ఆయన చాలా రెమ్యునరేషన్ అడిగారని.. అయితే, బిగ్‌బాస్ టీమ్ తొలుత సందేహించినా ఆ తర్వాత అతనికున్న క్రేజ్ ను చూసి ఓకే చెప్పిందని సమాచారం. మొత్తం మీద ఈసారి వేణు స్వామి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. హౌస్ లో అడుగు పెట్టాక ఆయన ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తారో ? హౌస్ లో జరగబోయే విషయాలను ముందుగానే జాతకం ద్వారా తెలుసుకొని చెప్పగలరా ? అనేది ప్రస్తుత ఆసక్తికర అంశంగా మారింది.
వేణు స్వామి కాకుండా ఇంకా ఈసారి ఎవరెవరిని తీసుకుంటారనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన బర్రెలక్కను సెలెక్ట్ చేశారని, కుమారి ఆంటీ కూడా సెలెక్ట్ అయ్యారంటూ పలు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సారి వేణు స్వామి ఎంట్రీ తో బిగ్ బాస్ హౌస్ షేక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.