Venu Swamy : ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి గురించి తెలియనివారంటూ ఎవరూ ఉండరేమో. సినీ ప్రముఖులు, పొలిటీషియన్స్ జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. ఈ స్వామి అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్య డివోర్స్ తీసుకుంటారని చెప్పి వర్తల్లో నిలిచారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వీరిద్దరు విడాకులు తీసుకోవడంతో ప్రజలు వేణు స్వామి మాటలు నమ్మడం మొదలుపెట్టారు. ఈయనకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ పెరిగింది. దింతో అప్పట్లో చాలా మంది సినీ సెలబ్రిటీలు ఆయనతో జాతకం చెప్పించుకునేందుకు క్యూలు కట్టారు. ఆయనతో స్పెషల్ పూజలు చేయించుకున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల వేణు స్వామి తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై జోష్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ గెలుస్తారని చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తారంటూ చెప్పారు. ఒకవేళ ఇది జరగకపోతే తాను జాతకాలు చెప్పడం మానేస్తానని అనౌన్స్ చేశాడు. అయితే ఎన్నికల్లో కేసీఆర్ చిత్తు చిత్తుగా ఓడి కాంగ్రెన్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. దీంతో వేణు ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. ఇలాంటి సిచ్యువేషన్ లోనూ వేణు స్వామి మరోసారి తన నోటికి పని చెప్పారు. ఇటీవల పెళ్లి చేసుకున్న వరుణ్, లావణ్యలు ఒక స్త్రీ కారణంగా విడిపోతారని సంచలన కామెంట్స్ చేశాడు.
వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కొణిదెల జాతకాల గురించి చెప్పారు. “వీరిద్దరి జాతకాల్లో గురువు, శుక్రుడు నీచ స్థానంలో ఉన్నారు. వీళ్ళిద్దరూ భవిష్యత్తులో కలిసుండే ఛాన్సులు లేవు. లావణ్య జాతకంలో కుజ దోషం ఉంది. ఇక వరుణ్ కు నాగ దోషం ఉంది. ఈ ఇద్దరి ఫ్యామిలీలో ఒక స్త్రీ కారణంగా వీరు విడిపోయే అవకాశం ఉంది. నాగ చైతన్య, సమంత జాతకాలు చూసి విడిపోతారని చెప్పాను. అప్పట్లో నా మాటలు నిజం అయ్యాయి. ఇప్పుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విషయంలోనూ నా మాటలు ఎట్టిపరిస్థితుల్లో అయినా నిజం అవుతాయి’” అంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు . అయితే ఈ ఇంటర్వ్యూ చూసిన మెగా ఫ్యాన్స్ వేణు స్వామీపై మండిపడుతున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.