Venu Swamy : పుట్టుకతోనే ఎన్టీఆర్ కు దోషం ఉంది

Venu Swamy : ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ సెలబ్రిటీలు, ఫేమస్ పొలిటీషియన్స్ జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. వేణు స్వామి అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్య డివోర్స్ తీసుకుంటారని చెప్పి వర్తల్లో నిలిచారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వీరిద్దరు విడాకులు తీసుకోవడంతో ప్రజలు వేణు స్వామి మాటలు నమ్మడం మొదలుపెట్టారు. అంతేకాదు ప్రభాస్ టైం బాగోలేదని, ఆయన జాతకం ప్రకారం సినిమాలు పెద్దగా హిట్ కావని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహానికిగురై సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో చాలా మంది సినీ సెలబ్రిటీలు ఆయనతో జాతకం చెప్పించుకునేందుకు క్యూలు కట్టారు. ఆయనతో స్పెషల్ పూజలు చేయించుకున్నారు. ఇక ప్రభాస్ జాతకం చెప్పి వేణు స్వామి పెద్ద చిక్కుల్లోనే పడ్డాడు. ఈ మధ్యనే ప్రభాస్ ఏ సినిమా చేసినా హిట్ కాదు ఆయనతో సినిమా చేసేవారు జాతకం చూపించుకోవాలి అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. అయితే లేటెస్టుగా ప్రభాస్ నటించిన సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మరోసారి వేణు స్వామి హాట్ టాపిక్ అయ్యాడు. వేణు స్వామి ఇక జ్యోతిష్యం చెప్పడం మానుకో అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆయన్ని ట్రోల్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా వేణు స్వామి టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జాతకాన్ని చెప్పి మరోసారి వార్తల్లో నిలిచాడు.

venu-swamy-astrologer-shocking-comments-on-jr-ntr

అందరి స్టార్ లాగే వేణు స్వామి ఈసారి జూనియర్ ఎన్టీఆర్ జాతకం చెప్పాడు. అయితే ఆయన జాతకంలో దోషం ఉందని చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేశారు. వేణు స్వామి ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ” కొన్ని సంవత్సరాల క్రితం తిరుపతిలో ఎన్టీఆర్ తల్లి షాలినిని కలిశాను. ఆమెతో ఎన్టీఆర్ జాతకం గురించి మాట్లాడాను. ఆమె ఎన్టీఆర్ జాతకం తెలుసుకుని షాక్ అయ్యారు. పుట్టుకతోనే ఒక పెద్ద ప్రాబ్లమ్‎తో ఎన్టీఆర్ పుట్టారని వివరించాను. అయితే ఆమెకు ఎన్టీఆర్ కు దోషమున్నట్లుగా తెలుసట. అంత కరెక్ట్ గా ఎన్టీఆర్ జాతకం చెప్పడంతో ఆమె షాక్ అయ్యారు. ఆ సమస్య ఏంటో నాకు తెలుసని చెప్పాను. ఆయనకున్న దోషం గురించి వివరించాను. ఎన్టీఆర్ కు ఈ దోషం ఉన్నట్లు కేవలం సీనియర్ ఎన్టీఆర్ కు , తనకు మాత్రమే తెలుసని చెప్పారు. మీకు ఈ విషయం ఎలా తెలుసు అంటూ ఆశ్చర్యపోయారు.

venu-swamy-astrologer-shocking-comments-on-jr-ntr

“జూనియర్ ఎన్టీఆర్ ది మఖా నక్షత్రం. అదే నక్షత్రంలో జయలలిత పుట్టారు. జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి రావడానికి ఇంకా సమయం ఉంది. రాజకీయాల్లోకి రానివ్వకుండా ఎన్టీఆర్ తల్లి అడ్డుపడుతున్నారు. తాత సీనియర్ ఎన్టీఆర్ కి ఎలా రాజయోగం ఉండేదో రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడు ఎన్టీఆర్ కి కూడా అదే రాజ యోగం పడుతుంది. ఆయన నటించిన సినిమాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఏ సినిమా అయినా విజయవంతమవుతుంది.” ” అని వేణు స్వామి చెప్పారు. అయితే ఆ దోషం ఏమిటో అది మాత్రం తెలపలేదు వేణు స్వామి. దీంతో అభిమానుల్లో టెర్షన్ మొదలైంది.

Sri Aruna Sri

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

6 days ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

3 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

4 weeks ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago