Vennela Kishore : సౌత్ బ్యూటీ సమంత పేరు ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటుంది. ఎందుకంటే ఈ భామ క్రేజ్ అలాంటిది మరి. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలందరితో జత కట్టి ధూమ్ ధామ్ చేసింది సమంత. అందం అందుకు తగ్గ నటనతో అందరిని ఫిదా చేసింది. తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. మరీ ముఖ్యంగా సామ్ క్యూట్ నెస్ అంటే ఆమె అభిమానులు పడిచచ్చిపోతారు. అయితే ఈ భామ తన మాజీ భర్త నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నప్పటి సోషల్ మీడియాలో మరింత అటెన్షన్ పెరిగింది. నాగచైత్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత సామ్ కు మాయోసైటిస్ వ్యాధి ఉందని తెలియడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయినప్పటికీ పలు సినిమాల్లో నటించింది. అయితే ఆ సినిమాలు పెద్దగా ఆడనప్పటికీ సమంత తన పని తాను చేసుకుంటూపోయింది. భర్తతో విడిపోయినా స్ట్రాంగ్ గా ఉంటూ, తన వ్యాధితో పోరాడుతూ బ్రేవ్ ఉమెన్ గా పేరుసంపాదించుకుంది. అందుకే అమ్మడు ఎక్కడ కనిపించినా, ఏం మాట్లాడినా నెట్టింట్లో వైరల్ అవ్వాల్సిందే. ఇప్పటికీ ఆమె విడాకుల గురించి, నాగ చైతన్యతో ఆమె రిలేషన్ గురించి నెట్టింట్లో ఏదో ఒక వార్త కనిపిస్తూనే, వినిపిస్తూనే ఉంటుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో సమంత బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రముఖ కమెడియన్ వెన్నెల కిశోర్ గురించిన ఓ వార్త ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. తన ఫ్రెండ్ సమంత కోసం చేసిన త్యాగం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీలో చాలా తక్కువ టైంలోనే మంచి ఫ్రెండ్స్ అయ్యారు సమంత, వెన్నెల కిశోర్. అప్పట్లో వెన్నెల కిశోర్ సామ్ పెళ్లి వేడుకల్లోనూ కనిపించి సందడి చేశాడు. అయితే సమంత చైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత. చైతన్యతో పెద్దగా టచ్ లో లేడు. అంతే కాదు అతనితో సినిమాలు కూడా చేయనని శపథం పెట్టుకున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే విడాకుల తర్వాత నాగ చైతన్య కస్టడీ, బంగార్రాజు మూవీస్ చేశాడు. అయితే ఈ సినిమాలకు సైన్ చేసిన తర్వాతనే ఈ కపులు విడాకులు తీసుకోవడంతో కమిట్ అయిన సినిమాలను చేయలేక తప్పలేదట. అయితే కస్టడీ సినిమా కోసం వెన్నెల కిశోర్‌ను మోసం చేసి సంతకం చేయించుకున్నారట. ముందు చైతన్యతో ఎలాంటి సీన్స్ ఉండవని చెప్పి ఆ తర్వాత ఆ హీరోతోనే సన్నివేశాలు చిత్రీకరించారట. ఈ క్రమంలో వెన్నెల కిశోర్ చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాడట. ఇకపై భవిష్యత్తులో చైతో కలిసి సినిమాలు చేసేది లేదంటూ భీష్మించుకుని కూర్చుకున్నాడట. అయితే ఈ న్యూస్ ఎంత వరకు కరెక్టో కానీ..ప్రస్తుతం నెట్టింట్లో ఇదే విషయం వైరల్ అవుతుంది. ఫ్రెండ్ అంటే వెన్నె కిశోర్‌లా ఉండాలని, అతడిని చూసి బుద్ధి తెచ్చుకోవాలంటూ సమంత ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.