Money Plant Puja: వాస్తు శాస్త్ర ప్రకారం చాలామంది ఇంట్లో ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అందులో ముఖ్యంగా తులసి మొక్క, మనీ ప్లాంట్ మొక్కలను తప్పకుండా ప్రతి ఒక్కరూ పెంచుకుంటూ ఉంటారు. ఈ మనీ ప్లాంట్ మొక్కలను ఇంట్లో బయట ఆఫీసులలో వ్యాపార స్థలాలలో ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. ఈ మనీ ప్లాంట్ మొక్క ఎక్కడ ఉంటే అక్కడ సంపదకు లోటు ఉండదని, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని హిందువులు భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా మనీ ప్లాంట్ మొక్క ఎంత బాగా ఎదిగితే మన అభివృద్ధి కూడా అంతే బాగా ఉంటుందని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు.
ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకోవడం చాలా ప్రయోజనకరం. అయితే మన ఇంట్లో మనం తులసి మొక్కతో పాటు మనీ ప్లాంట్ మొక్కను కూడా పెంచుకుంటూ ఉంటాం. అంతేకాకుండా మనీ ప్లాంట్ ను సంపదకు ప్రతీకగా కూడా భావిస్తూ ఉంటారు. మరి అలాంటి పవిత్రమైన మనీ ప్లాంట్ మొక్కను తులసి మొక్కలాగే పూజించాలి అన్న సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. నిత్య పూజలు చేయాలా ఇలాంటి సందేహాలు కలిగి ఉంటాయి. ఈ విషయంపై పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్‌ను సంపదను ఆకర్షించే మొక్కగా పరిగణిస్తారు. ఇంట్లో మనీ ప్లాంట్‌ను ఉంచడం వల్ల ఏదైనా ఆర్థిక సమస్యలు నయమవుతాయని నమ్ముతారు.
అది డబ్బు లేకపోవడం లేదా ఎక్కువ ఖర్చు చేయడం, డబ్బు ఖర్చు చేయడం, అప్పుల సమస్యలు లేదా చిక్కుకున్న డబ్బు లాంటివి అని చెప్పవచ్చు. ఇంట్లో ఎల్లప్పుడూ కూడా మనీ ప్లాంట్ మొక్కను దక్షిణ దిశలోనే ఉంచాలి. ఇలా పెంచడం వల్ల ఆ సంపదను తేవడంతో పాటు ఆదాయ వనరులను కూడా పెంచుతుంది. అలాగే ఇంట్లో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు తెస్తుంది.
వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్‌ను పూజించడం గురించి ఎటువంటి వివరణ లేనప్పటికీ, దానిని మతపరమైన కోణం నుండి పూజించవచ్చు. నిజానికి మనీ ప్లాంట్‌ను పూజించే ఆచారం లేదు. ప్రతిరోజూ మనీ ప్లాంట్‌లో నీళ్లతో పాలు పోస్తే చాలు, ఇది మనీ ప్లాంట్‌ను పూజించినట్లుగా భావిస్తారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.