Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నా సంగతి తెలిసిందే. ఇక పాన్ ఇండియా రేంజ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తనని తాను గ్రాండ్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే బన్నీ మీద సోషల్ మీడియాలో ఎంత పాజిటివ్ ప్రచారం ఉంటుందో అంతే స్థాయిలో నెగిటివ్ ట్రోల్ చేసే వారు కూడా ఉంటారనే సంగతి అందరికి తెలిసిందే. సెల్ఫ్ మేడ్ పాన్ ఇండియా స్టార్ అంటూ అతనిని ఒక వర్గం వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఇప్పుడు అల్లు అర్జున్ మీద మరో వివాదం తెరపైకి వచ్చేలా ఉంది.
బన్నీతో వరుడు సినిమాలో నటించిన భానుశ్రీ మెహ్రా అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ బ్యూటీ ఆ సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన మూవీ డిజాస్టర్ కావడంతో తరువాత హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది. తరువాత చిన్నాచితక పాత్రలు చేసుకుంటూ వచ్చింది. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోవడంతో యుట్యూబ్ చానల్ పెట్టుకొని ట్రావెల్ వ్లోగ్స్ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా భానుశ్రి ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టింది. అల్లు అర్జున్ తనని బ్లాక్ చేసాడు అంటూ ఒక స్క్రీన్ షాట్ షేర్ షేర్ మరి ట్వీట్ చేసింది. జీవితంలో ఒక చోట స్టక్ అయిపోతున్నాం అనుకున్నప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాలి. అలాగే నన్ను కూడా గుర్తు చేసుకోండి. వరుడు సినిమాలో నేను అల్లు అర్జున్ కి జోడీగా నటించాను.
అయితే నా కెరియర్ ఆశించిన స్థాయిలో ముందుకి వెళ్ళలేదు. అయితే ఇలాంటి కష్టకాలంలో కూడా కామెడీ అనిపించే విషయాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటిదే ఇది కూడా అల్లు అర్జున్ నన్ను ట్విట్టర్ లో బ్లాక్ చేశారు అని ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ పై భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది భానుశ్రీని బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. నా కెరియర్ ఫెయిల్యూర్ కావడానికి బన్నీ కారణం కాదు. ఆ విషయం నాకు తెలుసు. అయితే ఇందులో నా అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేశాను. అందులో తప్పు ఉందని నాకు అనిపించడం లేదు. మీరు తప్పుగా అర్ధం చేసుకుంటే అది నా తప్పు కాదు అని పేర్కొంది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై అల్లు అర్జున్ పీఆర్ టీమ్ ఏమైనా రియాక్ట్ అవుతారా అనేది చూడాలి.
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.