Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. శ్రీదుర్గ ఆర్ట్స్ పతాకంపై డా.కె.ఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన కీలక పాత్రధారుల లుక్స్, గ్లోబ్ ట్రాటర్ అంటూ రిలీజ్ చేసిన వారణాసి టైటిల్ గ్లింప్స్ ఒక్కసారిగా ఈ మూవీపై అంచనాలను పెంచిన సంగతి తెలిసిందే.
దర్శకుడు రాజమౌళి సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళడంలో, ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెంచడంలో ఉపయోగించే స్ట్రాటజీస్ గురించి ఎంతో ప్రత్యేకంగా చెప్పాలి. అయితే, రాజమౌళి రూపొందించే ప్రతీ సినిమా దేనికదే ప్రత్యేకంగా మారుతుంది. బాహుబలి ఫ్రాంఛైజీస్‌తో ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్‌గా.. ఆ తర్వాత జూ.ఎన్‌టీర్, రామ్ చరణ్‌లకు ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్స్‌గా క్రేజ్ తీసుకొచ్చిపెట్టాడు. ఇప్పుడు, సూపర్ స్టార్ మహేష్ బాబును హాలీవుడ్ రేంజ్ హీరోగా చూపించడానికి అన్నీ ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇప్పటికే, వారణాసి సినిమా గురించి ఏ వార్త వచ్చినా.. అది వైరల్ అవుతోంది. 2027 లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. మొత్తం 120 దేశాలలో ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్ లో ఆవిష్కరించబోతున్నారు. ఇక, తాజా సమాచారం మేరకు, మహేష్ బాబు-ప్రియాంక చోప్రాలపై ఓ సాంగ్‌ను షూట్ చేయడానికి రాజమౌళి బృందం రెడీ అవుతోంది. వారణాసి టైటిల్ గ్లింప్స్ సమయంలో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ పాడిన సంచారి సాంగ్ లిరికల్ వీడియో వచ్చి ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.
మరి, మహేష్-ప్రియాంక లపై రాజమౌళి చిత్రీకరించబోతున్న ఈ డ్యూయట్ ని ఏ సింగర్స్ పాడారో, ఎలా ఉండబోతుందో..ఎలాంటి సెట్స్‌లో ఈ పాట షూట్ చేయనున్నారో.. అని అటు మహేష్ అబిమానులతో పాటు ఇటు సినీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో, ఈ సాంగ్ కి సంబందించిన అప్‌డేట్ ని కూడా రాజమౌళి బృందం ఇవబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ చిత్రానికి కథ వి.విజయేంద్ర ప్రసాద్, సంగీతం ఎం ఎం కీరవాణి. దర్శకరచయిత దేవా కట్ట డైలాగ్స్ రాస్తున్నారు. 1300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో మహేష్ వారణాసి నిర్మితమవుతోంది. ఇటీవలే, ఈ మూవీ కోసం వేసిన సెట్స్‌కి సంబందించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Varun Tej: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఆయన సోదరి నిహారిక నిర్మాతగా…
Anil Ravipudi: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ మంచి సక్సెస్‌లను అందుకున్న సంగతి తెలిసిందే. నేను శైలజ…
Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన అవార్డు దక్కింది. తెలుగు చలన చిత్ర…
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ చిత్రంగా…
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
This website uses cookies.