Varalaxmi Sharathkumar : సౌత్ స్టార్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ రూటే సపరేటు. ఆమె ఎంత కూల్ గా ఉంటారు, తేడా వస్తే అంతే రఫ్‌గా ఎవరైనా సరే దుమ్ముదులిపేస్తారు. నిర్మొహమాటంగా ముగ్గుసూటిగా మాట్లాడే నటి వరలక్ష్మీ . ఏ భాషలోనైనా.. ఎలాంటి పాత్రనైనా చేయగల టాలెంట్ ఆమె సొంతం. అందుకే తమిళం, తెలుగు అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్ లో వరలక్ష్మీ రాణిస్తోంది. ఉమెన్ సెంట్రిక్ పాత్రలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ మధ్యనే వరలక్ష్మీ నటించిన శబరి సినిమా విడుదలైంది . ప్రస్తుతం పలు చిత్రాలు ఆమె లైనప్ లో ఉన్నాయి. అంతేకాదు రీసెంట్ గా వరలక్ష్మీ ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఈ క్రమంలో తాజాగా వరలక్ష్మీ ఓ ఇంటర్వ్యూ చేసింది. ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి నెగెటివిటీ స్ప్రెడ్ చేసే వారి దుమ్ముదులిపేసింది.
వరలక్ష్మీ కోలీవుడ్ నటుడు శరత్‌కుమార్ కూతురు. ఈ విషయం అందరికీ తెలుసు. శరత్ కుమార్ మొదట్లో ఛాయ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు పుట్టిన పాపే వరలక్ష్మీ. ఆ తరువాత కొన్ని కారణాలతో వారిద్దరూ విడిపోయారు. అనంతరం శరత్‌కుమార్ నటి రాధికను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ రాహుల్ అనే కొడుకు ఉన్నాయి. అయితే ప్రస్తుతం శరత్‌కుమార్ ఫస్ట్ వైఫ్ ఛాయ, రాధికలతో కలిసి మెలిసే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే జరిగిన వరలక్ష్మీ ఎంగేజ్‌మెంట్ లో వీరంతా కలికట్టుగా కనిపించారు. దీంతో ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ వచ్చాయి. దీనిపై సీరియస్ అయ్యింది వరలక్ష్మీ. తమ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటానికి మీరెవరూ అంటూ ట్రోలర్స్ పై మండిపడుతోంది.
ఇంటర్వ్యూలో వరలక్ష్మీ మాట్లాడుతూ..” అసలు నా గురించి నా ఫ్యామిలీ గురించి మాట్లాడటానికి మీరెవరు? మీరు కామెంట్స్ చేసే వ్యక్తి పర్సనల్ లైఫ్ గురించి మీకు ఏం తెలుసని మాట్లాడతారు. ఓ పోజిషన్ కి వచ్చారంటే దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసా? ఇవేమీ ఆలోచించకుండా నాలిక ఉంది కదా అని చాలా ఈజీగా కామెంట్స్ చేస్తారు. హీరోహీరోయిన్లు ఇతరులకు సాయం చేయలేదని మీరు కామెంట్లు పెట్టేకంటే .. మీరెందుకు సాయం ఎందుకు చేయరు. నిజం చెప్పాలంటే ప్రపంచంలోనే నటీమణులకే రెమ్యునరేషన్ చాలా తక్కువ. మాకు డబ్బు ఎప్పుడు వస్తుందో తెలియదే. షూటింగ్ లేకపోతే ఇన్కమ్ ఉండదు. కానీ కొంత మంది మేము చాలా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నామని ఫీల్ అవుతుంటారు. కానీ వాస్తవిక పరిస్థితులు అలా ఉండవు. మాకు ప్రతి నెల జీతాలు రావు. కానీ నెలకు తమ వద్ద పని చేసేవారికి జీతాలు ఇవ్వాల్సి . షూటింగ్ ఉంటేనే డబ్బులు లేకపోతే లేదు. అందుకే మాది చాలా రిస్కీ జాబ్”. అని చెప్పింది వరలక్ష్మీ శరత్‌కుమార్ .
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.