Vaishnavtej-Rituvarma : గత కొంతకాలంగా సోషల్ మీడియాలో టాలీవుడ్ నటి రీతూవర్మ మెగా హీరోతో రిలేషన్ లో ఉందంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. అల్లు అర్జున్ హోస్ట్ చేసిన వరుణ్ తేజ్ – లావణ్యల ప్రీ-వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లోని ఫోటోలలో రీతూ వర్మ కనిపించడం వల్లే ఈ రూమర్స్ పుట్టుకొచ్చాయి.ఈ పుకార్లకు సోషల్ మీడియా కాస్త ఊహాగానాలకు ఆజ్యం పోసాయి. వైష్ణవ్ తేజ్ తో రీతూ లవ్ లో ఉందంటూ ప్రచారం ప్రారంభించారు.
అయితే తనకు రీతుకు మధ్య ఏమీ లేదని ఇవన్నీ పుకార్లు మాత్రమే అని వైష్ణవ్ తేజ్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ఆదికేశవ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వైష్ణవ్ తేజ్ ఓ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. ఇంటర్వ్యూలో మెగా హీరో మాట్లాడుతూ.. “ఇండస్ట్రీ లో రీతూ వర్మ, లావణ్య త్రిపాఠి క్లోజ్ ఫ్రెండ్స్. అందుకే మ్యారేజ్ ఈవెంట్ కి రీతూ కూడా వచ్చింది. లావణ్య ఫ్రెండ్ గానే రీతూ వర్మ ఈ ఈవెంట్ కి వచ్చింది. అంతకుమించి మా మధ్య ఇంకేదీ లేదు” అని వైష్ణవ్ తెలిపాడు.
అప్పట్లో వరుణ్ తేజ్, లావణ్య ల పైనా ఇవే సందేహాలు ఉండేవి. మెగా ఫ్యామిలీ వేడుకలో లావణ్య త్రిపాఠి కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి. అందులో మరీ ముఖ్యంగా నిహారిక పెళ్లిలో లావణ్య స్పెషల్ ఎట్రాక్షన్ గా గెలిచింది అందరికన్నా మామ పైన పడింది దీంతో వరుణ్ తేజ్ కి లావణ్య కి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ సోషల్ మీడియా కూడా కోడయ్ కూసింది. మొత్తానికి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ని పెళ్లి చేసుకో నీ తమ ప్రేమ కథకు శుభం కార్డు వేశాడు. ఇప్పుడు ఇదే తరహాలో వైష్ణవ్ తేజ్- రీతు వర్మలపై ఊహాగానాలు సాగుతున్నాయి. కానీ తమపై జరుగుతున్నది అంతా తప్పుడు ప్రచారమేనని తేజ్ కొట్టిపడేశాడు. మెగా ఫ్యామిలీ ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్- వైష్ణవ్ తేజ్ పై ఇలాంటి గుసగుసలు రొటీన్ గా మారుతున్నాయి.
వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ మూవీ నవంబర్ 24 న విడుదల కానుంది. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కాళేశ్వర్ రెడ్డి అనే పవర్ ఫుల్ పాత్రలో వైష్ణవ్ కనిపించనున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణా దాస్, రాధిక తదితరులు ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.