Vadi Biyyam: మన హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహిత స్త్రీలకు ఒడి బియ్యం ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తూ ఉంటారు. ఇలా పెళ్లయిన మహిళలకు ప్రతి ఏడాది తమ పుట్టింటి వారు తమ ఆర్థిక స్తోమతకు అనుగుణంగా తమ కూతురికి కొత్త బట్టలు పెట్టి ఒడి బియ్యం పోస్తుంటారు. అయితే ఇలా వడి బియ్యం పోయడానికి కారణం ఏంటి… ఒడి బియ్యం పోయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే విషయానికి వస్తే…
ఒడి బియ్యం సాంప్రదాయం గురించి పండితులు ఏం చెబుతున్నారంటే… సాధారణంగా మనిషి శరీరంలో నాడులు కలిసే ప్రతి చోట ఒక చక్రం ఉంటుంది. ఇలా మానవ శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి. ఈ ఏడు చక్రాలలో గౌరీదేవి ఏడు రూపాయలలో నిక్షిప్తమై ఉంటుంది.అందులో ఒకటి మణిపుర చక్రం నాభి వద్ద ఉంటుంది. ఈ మణిపుర చక్రంలోని మధ్య భాగంలో ఒడ్డి యాన పీఠం ఉంటుంది. ఈ ఒడ్డి యాన పీఠంలో ఉండే శక్తిని మహాలక్ష్మిగా భావిస్తారు. అందువల్ల వివాహం జరిగిన తర్వాత ఆడపిల్లలకు వడిబియ్యం సమర్పించడం అంటే ఒడ్డి యాన పీఠంలో ఉన్న మహాలక్ష్మి అనే శక్తికి బియ్యం సమర్పించడం అని అర్థం.
మహాలక్ష్మిగా భావించి తన అల్లుడిని విష్ణుమూర్తిగా భావించి ఆమెకు ప్రతి ఏడాది లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి పుట్టింటి వారు ఒడి బియ్యం పోయడం జరుగుతుంది.తల్లి ఒడి అంటే రక్షణకు నిలయమని భావిస్తారు. మహాలక్ష్మిగా భావించే ఆడపిల్ల తమ కుటుంబ సభ్యులకు రక్షణగా నిలుస్తారని ఈ విధంగా ప్రతి ఏడాది వడి బియ్యం పోయడం వల్ల తమ కుమార్తె ఎంతో సంతోషంగా ఉండటమే కాకుండా తన ఇంట్లో అష్టైశ్వర్యాలు కూడా వెల్లు వెరుస్తాయని భావించి తల్లిదండ్రులు కుమార్తెకు ఒడిబియ్యం పోస్తారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.