Urfi Javed: బాలీవుడ్ లో సోషల్ మీడియా సెన్సేషన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటి ఉర్ఫీ జావెద్. సీరియల్స్ లో నటించి తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న ఉర్ఫీ జావేద్ తన చిత్ర విచిత్రమైన కాస్ట్యూమ్స్ తో సోషల్ మీడియాలో సెన్సేషనల్ మోడల్ గా ఫేమస్ అయ్యింది. ఇంస్టాగ్రామ్ లో మిలియన్స్ లో ఆమెను ఫాలో అయ్యేవారు ఉన్నారు. ఆమె పెట్టే ఫోటోలకు కూడా లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. కంటికి కనిపించే ప్రతి వస్తువును కూడా కాస్ట్యూమ్స్ గా మార్చేసుకుని వేసుకోవడం ఈ బ్యూటీ నైజం. ఈమె కాస్ట్యూమ్స్ పై సామాజిక రాజకీయ నాయకులు సంచలన విమర్శలు చేస్తూ ఉంటారు. అయినా కూడా లెక్కచేయకుండా తనదైన పంథాలోనే వెళుతుంది.
ఇదిలా ఉంటే తాజాగా తన జీవితంలోని ఎదురైన చేదు జ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకుంది. తాను 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఫేస్ బుక్ లో పెట్టిన ఒక ఫోటోని ఎవరో అడల్ట్ సైట్ లో పోస్ట్ చేశారని పేర్కొంది. అయితే ఆ విషయం తెలుసుకున్న తన తండ్రి కనీసం తన ప్రమేయం లేకుండా జరిగిన తప్పుకి ఇష్టానుసారంగా తనను కొట్టారని తెలియజేసింది. ఇక కూతురుగా తన ఆత్మ అభిమానాన్ని కూడా లెక్క చేయకుండా తన ఫోటోలను అడల్ట్ సైట్ నుంచి తొలగించడానికి 50 లక్షలు డిమాండ్ చేస్తున్నారు అంటూ బంధువులకి ప్రచారం చేస్తూ సింపతి పొందే ప్రయత్నం చేశాడని ఆరోపించింది.
అలాగే తనను ఉపయోగించుకొని డబ్బులు కూడా సంపాదించారని ఆరోపించింది. అలా తండ్రి కారణంగా బంధువుల అందరి మధ్యలో తాను ఆ నిందని మోస్తూనే రెండేళ్లు నరకం అనుభవించానని తెలిపింది. ఇక ఆ మానసిక వ్యధ భరించలేక 17 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయాను అని తెలిపింది. ఆ తర్వాత ముంబైలో చాలా కష్టాలు పడ్డాను అని పేర్కొంది. చిన్నచిన్న పాత్రలతో సీరియల్స్ లో అవకాశాలు సొంతం చేసుకుంది. బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసేంతవరకు కనీసం తనకు వేసుకోవడానికి రెండు జతల బట్టలు కూడా ఉండేవి కాదని ఉర్ఫీ జావేద్ పేర్కొంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.