Twitter: సోషల్ మీడియాలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి చేరువ అయిన షార్ట్ మెసేజ్ మైక్రో బ్లాగింగ్ సర్వీస్ ట్విట్టర్. ఈ ట్విట్టర్ లో గత కొంత కాలం అనేక మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎలాన్ మాస్క్ ట్విట్టర్ బాధ్యతలని తీసుకున్న తర్వాత సమూలంగా ప్రక్షాళన చేయడంతో పాటు ట్విట్టర్ బ్లాగర్ సర్వీస్ లో కూడా మార్పులు తీసుకొస్తున్నారు. ఒకప్పుడు సెలబ్రిటీలు, ప్రముఖ రంగాలలో ఉన్న దిగ్గజాలకి వారికి ఉన్న ఫాలోవర్స్ బట్టి బ్లూ టిక్ మార్క్ ఫ్రీగా ఇచ్చేవారు. అయితే ఇప్పుడు బ్లూటిక్ మార్క్ పై సబ్ స్క్రైబ్ రుసుము వసూలు చేస్తున్నారు. ఇప్పటికే బ్లూ టిక్ మార్క్ ని పెయిడ్ సర్వీస్ గా మార్చింది. దీంతో బ్లూ టిక్ మార్క్ కావాలని అనుకుంటున్న అందరూ కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు.
ఇదిలా ఉంటే బ్లూటిక్ మార్క్ ఉన్న వారి ప్రొఫైల్ లో వచ్చే యాడ్స్ మీద రెవెన్యూని షేర్ చేస్తామని మరో కొత్త విధానం కూడా అమల్లోకి తీసుకొచ్చారు. ఇన్స్టాగ్రామ్ తరహాలో యాడ్స్ రెవెన్యూ షేరింగ్ కి ఇప్పుడు ట్విట్టర్ పెద్ద పీట వేయడంతో సెలబ్రిటీలకి, మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నవారికి దీని ద్వారా మంచి ఆదాయం వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా ట్విట్టర్ లో పోస్ట్ కి సంబందించిన క్యారెక్టర్స్ లిమిట్ పెంచుతామని ట్విట్టర్ ప్రతినిధులు చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతం ట్వీట్ లో క్యారెక్టర్ లిమిట్ కేవలం 280 పదాల వరకు మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు ఈ పదాల సంఖ్యని 4 వేల క్యారెక్టర్స్ కి పెంచింది.
ఇలా పెంచడం ద్వారా పెద్ద పెద్ద మెసేజ్ లని కూడా పోస్ట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఈ క్యారెక్టర్స్ 4000 అవకాశం అనేది కేవలం బ్లూటిక్ మార్క్ ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది అని షాకింగ్ న్యూస్ చెప్పింది. అలాగే ముందుగా ఈ సర్వీస్ ని అమెరికన్ వినియోగదారులని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అక్కడ సక్సెస్ ఫుల్ గా రన్ అయిన తర్వాత మొత్తం ప్రపంచ దేశాలకి విస్తరిస్తామని ట్విట్టర్ ప్రతినిధులు తెలిపారు. మొత్తానికి ట్వీట్ క్యారెక్టర్స్ లిమిట్ పెంచిన కూడా దానిని కేవలం బ్లూ టిక్ మార్క్ ఉన్నవారికి మాత్రమే అందిస్తూ ఉండటం సామాన్య యూజర్స్ కి షాక్ అని చెప్పాలి.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.