Tirumala Tirupati: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు కోట్లాదిమంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు అయితే తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవడానికి విదేశీయులు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్న సంగతి తెలిసిందే. ఇలా విదేశాల నుంచి స్వామివారి దర్శనం కోసం వస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తను తెలియజేసింది.. విదేశాల నుంచి స్వామి వారి దర్శనం కోసం వచ్చే ఎన్నారైల సౌకర్యార్థం సుపథం మార్గం ద్వారా కల్పించే ప్రత్యేక ప్రవేశ దర్శన కాలపరిమితిని భారీగా పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
ఎన్నారైలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం గడువు ప్రస్తుతం కేవలం 30 రోజులు మాత్రమే ఉండేది అయితే ఈ 30 రోజులను 90 రోజులకు పెంచారు. ఈ నిబంధనలు జూన్ 6వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి.ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన 30 రోజుల్లోనే ఎన్ఆర్ఐలు తమ ఒరిజినల్ పాస్‌పోర్టు, వీసా ఆధారంగా తిరుమలలోని సుపథం మార్గం ద్వారా రూ. 300 టికెట్ తీసుకొని స్వామి వారిని దర్శనం చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇలా 30 రోజులు గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఎన్నారై లకు సరైన సమయం లేకపోవడంతో స్వామి వారిని దర్శనం చేసుకోలేకపోతున్నట్లు భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి.
ఇలా ఎన్నారై భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకున్న టీటీడీ యాజమాన్యం, ప్రవాస భారతీయుల సౌకర్యార్థం ఆ గడువును 90 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇలా 90 రోజులు గడువు పెంచడంతో ఎన్నారై భక్తులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శనం చేసుకునే వెసులు బాటును కల్పించింది. భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని టీటీడీ ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలను తీసుకుంటున్న నేపథ్యంలో భక్తులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా బాటగంగమ్మ సర్కిల్ నుండి గోగర్భం సర్కిల్ వరకు సరికొత్తగా శాశ్వత క్యూలైన్‌ను ఏర్పాటు చేయాలని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.