TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద ఎత్తున విరాళాలను భక్తులు అందజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారికి వచ్చే విరాళాల ద్వారా టీటీడీ ఎన్నో రకాల సహాయ సహకారాలను అందజేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది .టీటీడీ ఖాతాకు జమవుతున్న విరాళాలు ఎన్నో ప్రాణాలను సైతం నిలబెడుతున్నాయి. భక్తులు అందిస్తున్న విరాళాల ద్వారా టీటీడీ కొన్ని ట్రస్టులను నిర్వహిస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు. ఇందులో భాగంగానే ఎస్ వి ఆపన్న హృదయ పథకం ద్వారా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లను నిర్వహిస్తున్నారు.
ఇలా ఆపన్న హృదయ పథకం ద్వారా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లను నిర్వహిస్తూ ఇప్పటికే ఎంతోమందికి పునర్జన్మను ప్రసాదించారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో టిటిడి భక్తులను కూడా భాగస్వామ్యం చేయాలని నిర్ణయం తీసుకుంది.రూ. లక్ష చెల్లిస్తే శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం, వసతి, లడ్డు ప్రసాదం అందజేయనున్నారు. ఈ విధంగా విఐపి బ్రేక్ దర్శనం కావాలనుకుని భక్తులు ఆపన్న హృదయ పథకానికి లక్ష రూపాయలను విరాళం అందజేస్తే చాలు.ప్రాణదానం ట్రస్ట్ కింద ఎస్ వి ఆపన్న హృదయ పథకం అమలవుతోంది.
ఈ పథకానికి విరాళాలు ఇచ్చే దాతలకు టీటీడీ ప్రత్యేకంగా వీఐపీ బ్రేక్ దర్శన అవకాశాలను కల్పిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా భక్తులకు పలు ప్రయోజనాలు కల్పిస్తోంది. ఒకరు లక్ష రూపాయలు చెల్లిస్తే చాలు వారితో పాటు మరో 5 మందికి విఐపి బ్రేక్ దర్శనం, ఉచితంగా స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేస్తున్నారు.సెక్షన్ 80G కింద ఆదాయపు పన్ను మినహాయింపు కూడా పొందే ఛాన్స్ ఉంది. టిటిడిని నేరుగా లేదంటే TTD అధికారిక వెబ్‌సైట్ లో ఆపన్న హృదయ స్కిమ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…
టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…
Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…
AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…
TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…
NATS: అమెరికాలోని షార్లెట్ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…
This website uses cookies.