Trisha Krishnan: ఈ మధ్య బాగా వైరల్ అయిన విషయాలలో ఒకటి ‘యానిమల్’ సినిమా రెండు త్రిష-మన్సూర్ అలీ వివాదం. ఈ రెండు సోషల్ మీడియాను ఊపేశాయి. చివరికీ త్రిష-మన్సూర్ అలీ వివాదం సద్దుమణిగినట్టే అనిపిస్తోంది. ఇంతలోనే మళ్ళీ ఓ పోస్ట్ పెట్టి నెటిజన్స్ కి పలహారం అయింది త్రిష కృష్ణన్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రన్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కి పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సినిమా ‘యానిమల్’.
ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బద్దలయ్యాయి. ఊహించని మాజిక్ ఫిగర్ వసూళ్ళు ‘యానిమల్’ మూవీ రాబట్టింది. అటు నార్త్ లో ఇటు సౌత్ లో సినీ ప్రముఖులందరూ ‘యానిమల్’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో త్రిష కూడా తన ఇన్‌స్టాలో ‘యానిమల్’ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టి మళ్ళీ కాసేపటికి డిలీట్ చేసింది.
అదే ఇప్పుడు త్రిషకి తిప్పలు తెచ్చిపెట్టింది. ఈ మూవీ ఓ కల్ట్ మువీ అని అభిప్రాయపడ్డ త్రిష మేకర్స్ ని అభినందిస్తూ స్మైలీ ఏమోజీలను పెట్టింది. మళ్ళీ కాసేపట్లోనే ఆ పోస్ట్ ని డిలీట్ చేసింది. దీనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఈ సినిమా బావుందని పోస్ట్ పెట్టి మళ్ళీ ఎందుకు డిలీట్ చేసినట్టు అంటూ త్రిషను ప్రశ్నిస్తున్నారు. మరి ఎందుకు త్రిష ఈ పోస్ట్ డిలీట్ చేసిందనే విషయం క్లారిటీ లేదు.
బహుషా ఇలాంటి కల్ట్ మూవీని ప్రశంసించినందుకు ట్రోల్స్ వస్తాయని భయపడిందేమో అని కొందరు అంటున్నారు. కాగా, ఇటీవల తమిళంలో విజయ్ సరసన నటించిన ‘లియో’ సినిమాతో మంచి హిట్ అందుకుంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సినిమాలలో నటించే అవకాశాలున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.