Triptii Dimri : బెడ్‌రూమ్‌ సీన్‌‎లో తప్పేముంది..యానిమల్ బ్యూటీ కామెంట్స్

Triptii Dimri : టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూపొందించిన యానిమల్‌ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ సినిమా నార్త్, సౌత్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. అయితే ఇది ఫ్యామిలీతో వెళ్లే సినిమా కాదని సన్, ఫాదర్ సెంటిమెంట్ తో తీసిన ఫుల్ లెన్త్ యాక్షన్ సినిమా అని సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కో రివ్యూ ఇస్తున్నారు. రివ్యూల సంగతి ఎలా ఉన్నా సినిమాను జనాలు మాత్రం ఎగబడి చూస్తున్నారు. ఈ క్రమంలో యానిమల్ మూవీకి సంబంధించి జరుగుతోన్న ఓ డిస్కషన్ పైన తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన తృప్తి డిమ్రి తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

triptii-dimri-what-wrong-with-bedroom-scene-in-animal-movie

నటి తృప్తి డిమ్రి యానిమల్ మూవీతో బోలెడంత క్రేజ్‌ సంపాదించుకుంది. ఈ మూవీలో చాలా క్లిష్టమైన సీన్స్‎లో కనిపించి తన బోల్డ్ యాక్టింగ్ తో అందరి మైండ్ బ్లాక్ చేసింది. ఏ సీన్ అయినా సరే డైరెక్టర్ చెప్పిన విధంగా ఎలాంటి బెరుకు లేకుండా నటించింది తృప్తి. అందరి మనసులను ఆకట్టుకుంది. ఈ బ్యూటీ అందం, ఫిగర్, అభినయం చూసిన కుర్రాళ్లు త్రిప్తిని తమ ఫేవరెట్‌ క్రష్‌ లిస్ట్ లో చేర్చుకున్నారు.ఒక్క సినిమాతో ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా తను నటించిన సీన్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ” యానిమల్ లో జోయా క్యారెక్టర్ కు ఇంతలా క్రేజ్ వస్తుందని ఊహించలేదు. అయితే చాలామంది హీరోతో చేసిన బెడ్‌రూమ్‌ సీన్‌ గురించే డిస్కర్ చేస్తున్నారు. నిజానికి ఈ సీన్‌ కన్నా బుల్‌బుల్‌ మూవీలోని అత్యాచార సీన్ చాలా కష్టమైంది. ఇదంతా నేను ఓ యాక్టర్ గా కాకుండా ఒక అమ్మాయిగా చెబుతున్నాను. నిస్సహాయ స్థితిలో అంతా ఇచ్చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఆ సీన్ తో పోలిస్తే యానిమల్‌లో నేను చేసింది చాలా చిన్న విషయం. ఒక యాక్ట్రెస్ గా డైరెక్టర్ చెప్పినట్లు నా క్యారెక్టర్ కు నేను న్యాయం చేశాను. అందుకే బట్టలు లేకుండా ఆ సన్నివేషంలో నటించాను. అందులో తప్పేమీ లేదు. ఇదంతా సినిమా. ప్రొఫెషన్ కు సంబంధించిన విషయం.

triptii-dimri-what-wrong-with-bedroom-scene-in-animal-movie

మేము యానిమల్ లో బెడ్ రూమ్ సీన్ షూట్ చేసేప్పుడు సెట్‌లో కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. నాతో పాటు హీరో రణ్‌బీర్‌, డైరెక్టర్ సందీప్‌ రెడ్డి, కెమెరామన్‌ మాత్రమే షూట్ లో ఉన్నాం. అంతకు మించి ఇంకెవరూ లేరు. ఇక షూట్ సమయంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి నా సిచ్చువేషన్ గురించి అడుగుతూనే ఉన్నారు. నువ్వు ఓకేనా? కంఫర్ట్‌గానే ఉన్నావా? ఇబ్బంది ఉంటే చెప్పు అని ఆరా తీశారు. సో నేను చాలా కంఫర్ట్ గా ఆ సీన్ నటించాను. ఈ సీన్ కోసం వారంతా నాకు ఎంతో సపోర్ట్‌ చేశారు. అయితే రణ్‌బీర్‌తో యాక్ట్ చేసే సన్నివేషం కావడంతో మొదట్లో కాస్త కంగారుపడ్డాను. కానీ రణ్ బీర్ అది అర్థం చేసుకున్నాడు. నన్ను ఫ్రీ చేసేందుకు అతను నాతో మాట్లాడారు. కంఫర్ట్ ఫీల్ అయ్యేలా చేశాడు. ముందు ఎవరి సన్నివేషం షూట్ చేయాలంటే వారిది చేద్దాం అని చాలా స్వీట్‌గా మాట్లాడాడు. నాకున్న కంగారును పోగొట్టాడు” అని తృప్తి డిమ్రి చెప్పుకొచ్చింది.

triptii-dimri-what-wrong-with-bedroom-scene-in-animal-movie
Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 hour ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

3 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

2 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

3 days ago

This website uses cookies.