Health Tips: సాధారణంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే కనుక డాక్టర్ని సంప్రదిస్తాము అలాంటి సమయంలో డాక్టర్స్ వివిధ రకాల పరీక్షలు చేస్తుంటారు ఈ క్రమంలోనే ఒకసారి మన నాలుకను కూడా ఆయన టెస్ట్ చేస్తారు. ఇలా నాలుక చెక్ చేసిన తర్వాత కొన్ని పరీక్షలు కూడా మనకు రాసిస్తూ ఉంటారు అయితే ఇలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళగానే నాలుకను చూసి వారు ఏమి నిర్ధారణ చేసుకుంటారు. కొన్నిసార్లు మన నాలుక రంగులో కూడా మార్పులు రావడం మనం గమనిస్తుంటాము. ఇలా నాలుక రంగు మారితే ఏదైనా ప్రమాదం సంభవిస్తుందా అసలు డాక్టర్లు ఎందుకు ఇలా పరీక్ష చేస్తారు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా మన నాలుక లేత గులాబీ రంగులోను లేదా ముదురు రంగులో ఉండి నాలుక పై చిన్నటి తెల్లటి పొర ఉంటే ఎలాంటి సమస్య లేదు. ఇక ఎల్లప్పుడూ కూడా మన నాలుక ఇలాగే ఉండి తడితో ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఆ వ్యక్తి పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని అర్థం. అలాకాకుండా కొందరి నాలుకపై తెల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి అలాగే నాలుక మొత్తం పొడిబారి పోతుంది. ఇలా తెల్లటి మచ్చలు ఉన్నాయి అంటే తప్పనిసరిగా నాలుకపై ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని అర్థం. అలాగే నాలుక కొన్నిసార్లు నలుపు రంగులోకి మారుతుంది అలాంటి సమయంలో గొంతులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు అలాగే ఇది కొన్ని సార్లు క్యాన్సర్ కి కూడా కారణం అవుతుంది.
ఈ విధంగా నాలుక నలుపు రంగులోకి వచ్చిన వెంటనే మనం వైద్యున్ని సంప్రదించడం ఎంతో ముఖ్యం అలాగే మరి కొంతమందిలో నాలుక నీలిరంగులోకి మారుతూ ఉంటుంది. ఇలా నీలిరంగులోకి నాలుక మారటం కూడా పెద్ద ప్రమాదమని చెప్పాలి. ఎప్పుడైతే మన శరీరంలో గుండె పనితీరు సరిగా చేయకుండా అన్ని భాగాలకు రక్తాన్ని సరిగా సరఫరా చేయదో అప్పుడే నాలుక నీలిరంగులోకి మారుతుంది. అలాగే మన శరీరానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ లభించలేదని అర్థం. ఇలా నాలుక నీలిరంగులోకి మారింది అంటే మనకు గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అర్థం. ఈ విధంగా నాలుక రంగులో కనుక మార్పులు వస్తే వెంటనే వైద్యుని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యం ఇక అనారోగ్యం చేసినప్పుడు కూడా డాక్టర్లు నాలుకను పరిశీలించేది కూడా ఇందుకేనని చెప్పాలి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.