Tollywood : మరోసారి హిట్ కాంబో..నితిన్ కోసమే సెట్ చేశారా..?

Tollywood : యూత్‌స్టార్ నితిన్, రష్మిక మందన్న, వెంకీ కుడుమల కాంబినేషన్‌లో ఉగాది పండుగ సందర్భంగా కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. గతంలో ఇదే కాంబోలో వచ్చిన భీష్మ మంచి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. అప్పటికి నితిన్ ఫ్లాపుల్లో ఉన్నాడు. వెంకీ కుడుమల, రష్మిక మందన్నలతో కలిసి చేసిన భీష్మ నితిన్‌కి మంచి టర్నింగ్ పాయింట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ నితిన్ ఖాతాలో పెద్ద సక్సెస్ అనేది చేరలేదు. కానీ, రష్మిక మాత్రం వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్‌గా మారింది.

వెంకీ కుడుమలకీ మళ్ళీ సాలీడ్ ప్రాజెక్ట్ తగల్లేదు. మెగాస్టార్ చిరంజీవి ఛాన్స్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. అలాగే, రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నట్టు ప్రచారం జరిగింది. కానీ, మళ్ళీ నితిన్-రష్మికలతోనే తన నెక్స్ట్ సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రష్మిక, వెంకీ కుడుమల కంటే కూడా నితిన్ కెరీర్‌కి చాలా అవసరం. చేయడాని ఈ యూత్‌స్టార్ వరుసగా సినిమాలు చేశాడు గానీ, ఒక్కటి కూడా భారీ హిట్ సాధించలేదు.

Tollywood: venky kudumula new project with nithin and rashmika mandanna

Tollywood : లక్కీ స్టార్ నితిన్ కోసం డేట్స్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌..

గత చిత్రం మాచర్ల నియోజకవర్గం మీద నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ, ఈ సినిమా జనాలకి ఏమాత్రం నచ్చలేదు. ఈ సినిమా తర్వాత నితిన్ కొత్త కథలు విన్నా వాటిని ఫైనల్ చేసుకోలేకపోయాడు. చాలా ఆలోచించి ఫైనల్‌గా హిట్ జోడీనే సెట్ చేశాడు. ఈ సినిమాతో ఖచ్చితంగా నితిన్‌కి హిట్ పడాలి. లేదంటే రేస్‌లో ఇంకా వెనకబడిపోతాడు. లవ్ కం కమర్షియల్ సినిమా తీయడంలో వెంకీ కుడుమల సిద్ధహస్తుడు అని ఛలో, భీష్మ సినిమాలతో తేలిపోయింది.

ఇక రష్మిక ఉంటే సినిమా గ్యారెంటీ హిట్ అనే ముద్ర పడిపోయింది. ఐకాన్ స్టార్ సరసన చేసిన పుష్ప మూవీతో రష్మిక మందన్న రేంజ్ అమాంతం పెరిగింది. బాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీ వరుసగా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇలాంటి లక్కీ స్టార్ నితిన్ కోసం డేట్స్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గానూ మారింది. ఏదేమైనా ఈ హిట్ కాంబోలో కొత్త సినిమా అంటే మంచి బజ్ మాత్రం క్రియేట్ అయింది. చూడాలి మరి ఈ సినిమా నితిన్‌కి ఎంతవరకూ కలిసొస్తుందో.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

1 week ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

1 week ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

1 week ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

1 week ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

1 week ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

3 weeks ago

This website uses cookies.