Tollywood: తెలుగు సీనియర్ హీరోయిన్ జయప్రదకి ఓ నటుడు బలవంతంగా ముద్దు పెట్టాడా..? ఇంతకాలానికి ఇప్పుడెలా ఈ విషయం బయటపడింది..! ఇదే ప్రస్తుతం అన్నీ న్యూస్ పోర్టల్స్ లో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్న వార్త. అసలు విషయంలోకి వెళ్ళే ముందు సోషల్ మీడియా గురించి ఓ రౌండేద్దాం. గతంలో సినీ పరిశ్రమలో ఏ విషయం జరిగినా బయట ప్రపంచానికి తెలిసిపోయేది కాదు.
టాలీవుడ్ లో మాత్రమే కాదు మిగతా సౌత్ సినిమా భాషలలో, బాలీవుడ్ లో చీకటి వ్యవహారాలెన్నో జరిగాయి. కానీ, ఆ బాధలు అనుభవించిన వారికి చెప్పుకునేందుకు ఏ ఆస్కారం ఉండేది కాదు. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది. ఏ విషయమైన ఇట్టే ప్రపంచమంతా తెలిసిపోతుంది. దాంతో కొందరు సీనియర్ నటీమణులు అప్పట్లో వారు పడ్డ ఇబ్బందులను ఇప్పుడు వస్తున్న టాక్ షోలలో బయట పెడుతున్నారు. అది కాస్తా వార్తై అందరికీ తెలిసిపోతుంది.
ఇలా బయటకి వచ్చింది ఓ న్యూస్. అదేమిటంటే సీనియర్ నటి జయప్రదను ఓ సీన్ లో నటుడు తాహిల్ బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడని..అది తట్టుకోలేక జయప్రద చెంప పగలకొట్టిందని ఆ వార్త సారాంశం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని జయప్రద చెప్పినట్టుగా వార్తలు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది కాస్తా ఆ నటుడికి చేరింది. దీనిపై ఆయన స్పందించాడు.
సోషల్ మీడియా వచ్చాక ఏది నిజమో ఏది అబద్దమో తెలియకుండా ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా అలాంటి తప్పుడు వార్తేనని తాహిల్ క్లారిటీ ఇచ్చాడు. మేము గనక హీరోయిన్ తో రొమాంటిక్ సీన్ గానీ, రేప్ సీన్ గానీ చిత్రీకరించాల్సి వస్తే కథ, సీన్స్ చెప్పినప్పుడే హీరోయిన్‌తో క్లియర్‌గా చెప్తామని తెలిపాడు. ఇక జయప్రదను తాను ముద్దు పెట్టుకున్నట్టుగా ఆమె దానికి నా చెంప మీద కొట్టినట్టుగా వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదని వెల్లడించాడు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.