Categories: EntertainmentMovies

Tollywood: వేసవి వినోదానికి కొదవే లేదుగా… వేటికవే ప్రత్యేకం

Tollywood: టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అంటే మొన్నటి వరకు కమర్షియల్ ఎలిమెంట్స్ తప్ప కంటెంట్ లేని కథలు వస్తూ ఉంటాయనే విమర్శలు ఉన్నాయి. అందుకే టాలీవుడ్ సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ అయినా కూడా అవార్డులలో మాత్రం సత్తా చాటలేకపోయేవి. హిందీ సినిమాలకి, అలాగే తమిళ సినిమాలకి నేషనల్ అవార్డులు వచ్చినట్లుతెలుగు సినిమాలకి రావకపోవడానికి హీరోల ఆలోచన విధానం కారణం అనే అభిప్రాయం అందరిలో ఉండేది. ప్రేక్షకులని మెప్పించడానికి రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా కథలతోనే సినిమాలు చేసేవారు. ఈ కమర్షియల్ సినిమాలతో స్టార్స్ అయిన కూడా నటులుగా ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోయేవారు.

అయితే మారుతున్న కాలంతో పాటు ప్రేక్షకుల టేస్ట్ కూడా మారిపోయింది. ఒటీటీల హవా మొదలైన తర్వాత డిజిటల్ ఎంటర్టైన్మెంట్ భాగా ప్రేక్షకులకి రీచ్ అయ్యింది. అన్ని భాషల సినిమాలు, వెబ్ సిరీస్ లు డబ్బింగ్ రూపంలో చేరువ అవుతున్నాయి. ఇక ఆ కథలని చూసిన తర్వాత కమర్షియల్ ఫార్ములా స్టొరీలని థియేటర్స్ కి వెళ్లి చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. కథలో కొత్తదనం ఉంటేనే తప్ప థియేటర్స్ కి వెళ్ళడం లేదు. ఓపెనింగ్స్ వచ్చిన కూడా తరువాత కథ బాగుంది అనే టాక్ వస్తేనే థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. లేదంటే రెండో రోజే ఖాళీ అవుతాయి. ఈ నేపధ్యంలోనే హీరోల ఆలోచన విధానం పూర్తిగా మారింది. దీంతో కొత్తదనం ఉన్న కథల కోసం ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఆ దిశగానే తమ అడుగులు వేస్తూ ప్రస్తుతం సినిమాలు చేస్తున్నారు.

tollywood-summer-movies

అలా చేసిన వాటిలో ఈ ఏడాది వేసవి వినోదంగా రాబోతున్న సినిమాలు వేటికవే ప్రత్యేకత కలిగి ఉండటం విశేషం. మార్చి 30న రిలీజ్ కాబోతున్న నాని దసరా సినిమా ఫుల్ మాస్ కాన్సెప్ట్ తో పీరియాడిక్ జోనర్ లో తెరకెక్కింది. ఇక  ఏప్రిల్ 7న రవితేజ రావణాసుర రిలీజ్ అవుతుంది. ఈ మూవీ మాఫియా బ్యాక్ డ్రాప్ కథతో వస్తుంది. తరువాత నిఖిల్ హీరోగా స్పై మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది. అదే రోజు అల్లరి నరేష్ ఉగ్రం మూవీ కూడా రిలీజ్ అవుతుంది.

ఏప్రిల్ 21న సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. తరువాత అఖిల్ ఏజెంట్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతుంది.  అలాగే నాగచైతన్య వెంకట్ ప్రభు కాంబినేషన్ లో వస్తున్న కస్టడీ మూవీ మే 12న రిలీజ్ అవుతుంది. అదే రోజు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ హనుమాన్ రిలీజ్ కాబోతుంది.

Varalakshmi

Recent Posts

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

2 days ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

3 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

4 weeks ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

4 weeks ago

This website uses cookies.