Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’. ఈ మూవీతో నేచురల్ స్టార్ నాని కెరీర్ ప్రారంభంలో నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ పోటీ పడుతోంది. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ దర్శకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్నాడు. డిఫరెంట్ కథాంశాన్ని ఎంచుకున్నందుకు, దాన్ని సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతంగా ఆవిష్కరించిందుకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.
నాని సరసన మాళవిక నాయర్ నటించగా కీలక పాత్రల్లో విజయ్ దేవరకొండ, రీతూవర్మ కనిపించారు. రధన్ సంగీతం అందించగా, ఒక పాటకు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. 2015 మార్చి 31న రిలీజైన ఈ సినిమా మళ్ళీ పదేళ్ళ తర్వాత మార్చ్ 21న రీ రిలీజ్ అవుతోంది. అంతేకాదు, ప్రభాస్ నటించిన ‘సలార్’ తో పోటీ పడటం ఆసక్తికరం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ స్నేహితులుగా శృతి హాసన్ కీలక పాత్రలో నటించారు.
ఈ సినిమా కి కొనసాగింపు కూడా ఉంది. అయితే, ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజాసాబ్’..’ఫౌజీ’..సినిమాలను చేస్తున్నారు. అలాగే, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ చేయాల్సి ఉంది. వీటితో పాటుగా ‘కల్కి’ కొనసాగింపులోనూ ప్రభాస్ నటించాలి. అంతేకాదు, దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తారక్‌తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇది పూర్తవడానికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి ‘సలార్’ సీక్వెల్ ఆలస్యం కానుంది. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్‌ని డిసప్పాయింట్ చేయకుండా ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ మూవీని ఈ నెల 21న రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే, థియేటర్స్ హౌజ్ ఫుల్ అయినట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి రీ రిలీజ్‌లో ఎవడే సుబ్రమణ్యం, సలార్ ఏమేరకు వసూళ్ళు రాబడతాయో.
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…
MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్ సాధించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కేవలం…
This website uses cookies.