Tollywood: టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగిందంటూ తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయమై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారట. దీనికి సంబంధించి అసలు విషయంలోకి వెళదాం.
తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు మోహన్ బాబుకి అటు నిర్మాతగా ఇటు సీనియర్ హీరోగా ఎలాంటి పేరుందో అందరికీ తెలిసిందే. చిన్న వేశంతో ఇండస్ట్రీకి నటుడిగా పరిచయమైన మోహన్ బాబు ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా, నిర్మాతగా సక్సెస్‌లు చూశారు. ఆయన వారసులు అయిన మంచు విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్న కూడా తెలుగు ఇండస్ట్రీలో నటులుగా, నిర్మాతలుగా కొనసాగుతున్నారు.
ఇండస్ట్రీలో మోహన్ బాబు అంటే ‘హడల్’ అని అందరూ చెబుతుంటారు. ఆయన ముందు నించుని ధైర్యంగా మాట్లాడటానికి అందరూ సాహసించరు. క్రమశిక్షణ, టైమింగ్ విషయంలో ఆయన ఎంతో కఠినంగా వ్యవహరిస్తారు. దర్శకులు కూడా మోహన్ బాబు సినిమా అంటే కాస్త జాగ్రత్తగానే ఉంటారు. అంత కఠినంగా ఉండే ఆయన ఇంట్లోనే పనిమనిషి చోరీ చేయడం షాకింగ్ విషయం.
దాదాపు 10 లక్షల రూపాయలు దొంగతనం చేసినట్టుగా సమాచారం. జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసంలో నాయక్ అనే పనిమనిషి 10 లక్షల రూపాయలు తీసుకొని పారిపోయాడు. విషయం తెలుసుకున్న మోహన్ బాబు ఈ మంగళవారం (24.09.2024) రాత్రి రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వారు దర్ఫ్యాప్తు చేస్తున్నారు.
కాగా, మోహన్ బాబు ‘కన్నప్ప’ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన తనయుడు మంచు విష్ణు పాన్ ఇండియన్ చిత్రంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు పూర్తైతే ఈ ఏడాది చివరిన విడుదల చేయాలని విష్ణు సన్నాహాలు చేస్తున్నారు.
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…
MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్ సాధించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కేవలం…
This website uses cookies.