Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో దిగాయి. పండుగ సీజన్ సెలవులు, వారాంతరం కావడంతో బాగానే నెట్టుకొచ్చాయి. కానీ, నేటి నుంచి (సోమవారం) బుకింగ్స్ పరంగా ఏ సినిమా హిట్ సాధిస్తుంది ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా మిగులుతుందనేది తేలిపోతుంది.

మన శంకరవరప్రసాద్‌గారు:

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన మన శంకరవరప్రసాద్‌గారు సినిమా టేబుల్ ప్రాఫిట్‌తో రిలీజైంది. 18వ తేదీకి ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రాబట్టిన గ్రాస్ కలెక్షన్స్ 261 కోట్ల పైగానే వచ్చాయి. నయనతార హీరోయిన్‌గా, వెంకటేష్ గెస్ట్ రోల్ సినిమాకి బాగా కలిసి వచ్చింది. ఈ సినిమా ట్రేడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే భారీ లాభాలలోకి వచ్చేసింది. ఓవరాల్‌గా ఈ వారం పూర్తయ్యాక గానీ, ఈ సినిమాకి రాబట్టిన అసలు లాభాల లెక్కలు తేలవు.

ది రాజాసాబ్:

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ది రాజాసాబ్ ఈ సంక్రాంతి బరిలో జనవరి 9న వచ్చిన సినిమా. అన్నిటికంటే ముందు వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిందనేది క్లియర్‌గా అర్థమవుతోంది. మారుతి దర్శకత్వంలో కామెడీ అండ్ హర్రర్ జోనర్‌లో వచ్చిన ఇందులో సంజయ్ దత్, జరీనా వాహబ్ కీలక పాత్రల్లో నటించారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్‌గా కనిపించారు. చెప్పాలంటే మారుతి రేంజ్‌కి మించి తీసినట్టే. ఈ విషయంలో మారుతిని మెచ్చుకోవాలి. కానీ, కలెక్షన్స్ మాత్రం చాలా డల్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకూ రాజాసాబ్ 220 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టినట్టుగా తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే బ్రేకీవెన్ కావడానికి ఇంకా 40 శాతం వరకూ రాబట్టాల్సి ఉందని సమాచారం.

tollywood-real-collections-at-boxoffice-begins-from-today

Tollywood: ఫైనల్ రన్‌లో ఎవరెవరు సంక్రాంతి విజేతగా నిలబడతారో!.

భర్త మహాశయులకువిజ్ఞప్తి: మాస్ మహారాజ రవితేజ చాలా ఏళ్ళ తర్వాత ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాతో వచ్చాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా, ఆషికా రంగనాథ్..డింపుల్ హయాతి హీరోయిన్‌గా నటించారు. భర్త మహాశయులకువిజ్ఞప్తి ప్లాట్ కొన్ని పాత సినిమాలను గుర్తు చేస్తున్నప్పటికీ, ఆడియన్స్ మాత్రం బాగానే ఎంటర్‌టైన్ చేస్తోంది. కానీ, మేకర్స్ ఆశించిన సక్సెస్ మాత్రం దక్కలేదు. మరి, ఈరోజు నుంచి కలెక్షన్స్ పెరుగుతాయా అనేది వేచు చూడాలి.

అగనగా ఒకరాజు:

నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమా మెగాస్టార్ మన శంకరవరప్రసాద్‌గారు తర్వాత మంచి వసూళ్ళు రాబడుతున్న సినిమా. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం 70 నుంచి 80 కోట్ల మేర వసూళ్ళు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాతకి గ్యారెంటీగా లాభాలు తెచ్చిందని చెప్పుకుంటున్నారు. సంక్రాంతి రేసులో బాగా సత్తా చాటిన సినిమా కూడా అగనగా ఒక రాజు అనే ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. బాక్సాఫీస్ బుకింగ్స్ కూడా ఈ చిత్రానికి బాగా ఉన్నాయి.

నారీ నారీ నడుమ మురారి:

ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ నారీ నారీ నడుమ మురారి టైటిల్‌తో యంగ్ హీరో శర్వానంద్ వచ్చాడు. హీరోయిన్‌గా సంయుక్త, సాక్షి వైద్య నటించారు. చిరు, నవీన్ సినిమాల తర్వాత ఈ సంక్రాంతికి ప్రేక్షకాధరణ పొందిన సినిమా ఇదే అని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటి వరకూ 50 కోట్లకి పైగానే వసూళ్ళు వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మొత్తానికి, చిరంజీవ్..నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ సినిమాలు 2026 ప్రారంభంలో మంచి హిట్ సాధించేవిగా చెప్పుకుంటున్నారు. మరి, ఫైనల్ రన్‌లో ఎవరెవరు సంక్రాంతి విజేతగా నిలబడతారో చూడాలి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

2 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

2 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

3 days ago

Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా?

Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…

4 days ago

MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్

MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్ సాధించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కేవలం…

4 days ago

Puri-Slum Dog: ‘స్లమ్ డాగ్’గా విజ‌య్ సేతుప‌తి..పూరి ఈసారి కొట్టడం ఖాయం

Puri-Slum Dog: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని ఫిక్స్…

4 days ago

This website uses cookies.