Tollywood : రకుల్ పెళ్ళెక్కడో తెలిస్తే సమంత తప్ప ఇంకెవరూ గుర్తుకురారు..!

Tollywood : రకుల్ ప్రీత్ సింగ్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. తన యాక్టింగ్‎తో టాలీవుడ్‎లో స్టార్ నటిగా ఎదిగిన ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది రకుల్ . ఫస్ట్ మూవీలోనే భారీ డైలాగులతో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది . ఆ మూవీ తర్వాత వరుస ఆఫర్స్ అందుకొని.. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇండస్ట్రీలో ఉన్న యువ హీరోలతో పాటు పలువురు స్టార్ హీరోలందరితో ఈ భామ జోడీ కట్టి అదరగొట్టింది. తెలుగులో చివరగా కొండపొలం సినిమాలో నటించిన రకుల్ ఆ తర్వాత ఇక్కడ పెద్దగా వర్కౌట్ కావడం లేదని గుర్తించి బాలీవుడ్ ఇండస్ట్రీకి చెక్కేసింది. అక్కడ కూడా పలు క్రేజీ ప్రాజెక్టులను చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

tollywood-rakul-is-ready-for-the-destination-wedding-2

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. అక్కడ పలు సినిమాల్లో నటిస్తూ తన ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని బుంబై వీధుల్లో తిరుగుతోంది ఈ ముద్దుగుమ్మ . వీరిద్దరి రిలీషన్ గురించి బీటౌన్ లో ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. గత మూడేళ్లుగా వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారు. ఈ క్రమంలో రకుల్ తన ప్రియుడు బాలీవుడ్ నటుడు, ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. ఏడడుగులతో వీరి బంధాన్ని బలపరుచుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు . ఈ ఏడాది ఫిబ్రవరిలో రకుల్ ప్రీత్ సింగ్ , జాకీ భగ్నాని వివాహం చేసుకోనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీలు చేసుకున్నట్లే వీరూ డెస్టినేషన్ వెడ్డింగ్ కు రెడీ అవుతున్నట్లు సమాచారం. గోవాలోని ఓ బ్యూటిఫుల్ ప్లేస్ లో వీరి పెళ్లి జరుగబోతున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ మెంబర్స్, అతి కొద్ది సన్నిహితులు, స్నేహితుల నడుమవీరి పెళ్లి జరగబోతోందని ఇన్ఫర్మేషన్. త్వరలోనే తమ పెళ్లి డేట్ ను అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంది. రకుల్,జాకీలు ఇద్దరూ ప్రస్తుతం పెళ్లి పనుల్లో మునిగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

tollywood-rakul-is-ready-for-the-destination-wedding-2

ఇదిలా ఉండే గతంలో దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్యల పెళ్లి కూడా గోవాలోనే జరిగింది. కుటుంబసభ్యులు, కొంత మంది ఫ్రెండ్స్ మధ్య ఎంతో అద్భుతంగా వీరి వివాహం జరిగింది. ఇప్పుడు రకుల్ పెళ్లి ఇక్కడే జరుగుతుండటంతో అందరూ సామ్ ను గుర్తుచేసుకుంటున్నారు. సామ్ నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం వీరి రిలేషన్ అంతూ కూల్ గానే ఉంది. అయితే కారణం తెలియదు కానీ వీరిద్దరూ డివోర్స్ తీసుకున్నారు. ఎవరి లైఫ్ లో వారు చాలా బిజీ అయిపోయారు.

సరైనోడు, ద్రువ, లౌక్యం వంటి మూవీస్ తో తెలుగు చిత్ర పరిశ్రమలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది రకుల్ ప్రీత్ సింగ్. అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ పంచుకుని కొంత కాలం ఇండస్ట్రీలో తన చక్రాన్ని తిప్పింది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే బాలీవుడ్లో అడుగుపెట్టింది. బీ టౌన్ లోనూ రెండు మూడు సినిమాలు సక్సెస్ కావడంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే సౌత్ లో వచ్చినంత గుర్తింపు , క్రేజ్ బాలీవుడ్ లో ఈ భామకు లభించలేదనే చెప్పాలి. ఇక బీ ప్రస్తుతం ఈ చిన్నది హిందీ , తెలుగు ,తమిళ చిత్రాలలో పనిచేస్తోంది. లేటెస్టుగా తమిళంలో అయలాన్ , ఇండియన్ 2 సినిమాలు చేస్తోంది. ఇక కాబోయే పెళ్లి కొడుకు జాకీ భగ్నానీ గురించి తెలుసుకోవాలంటే ఫాల్తూ, రంగ్రేజీ, యంగీస్థాన్ చిత్రాలతో పాటు మరికొన్ని మూవీస్ లో జాకీ హీరోగా నటించాడు. అయితే ఈ సినిమాలేవీ హిట్ కాకపోవడంతో నటనకు స్వస్తి చెప్పి ప్రస్తుతం సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ బిజీ నిర్మాతగా మారారు.

Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

18 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

20 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.