Tollywood : తెలుగు చిత్రం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకి చాటిచెప్పిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఆయన కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేకపోవడం ఎంతో గొప్ప విషయం. ఒక్కో సినిమాకి చాలా సమయం తీసుకుంటారనే పేరుంది. బాహుబలి సిరీ నుంచి అయితే కనీసం తన సినిమా సిల్వర్ స్క్రీన్ మీదకి రావాలంటే ఎంత కాదన్నా 3 సంవత్సరాలు పడుతుంది. ఈ విషయంలో రాజమౌళి సొంత వాళ్ళ నుంచే విమర్శలు ఎదుర్కున్న సందర్భాలున్నాయి. అయితే, అవి సరదా విమర్శలే.
ఇదే విషయంలో రాజమౌళి ని ఆయన తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి సతీమణి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో పోల్చుతారు. నువ్వు పాన్ ఇండియా లెవల్‌లో సినిమా తీసినా పూరి మాదిరిగా 6 నెలల్లో సినిమా తీయడం చేతకాదని కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి తండ్రి రచయితగా పూరిని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఆయన ఫొటోను డీపీగా పెట్టుకున్నారు. ఇక రమా రాజమౌళి అయితే ఏకంగా పూరి దగ్గర రెండు రోజులు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయమని సలహా ఇచ్చారు.
ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ఓ ఆడియో ఫంక్షన్‌లో పూరీకి చెప్పారు. ప్రభాస్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ, ఎన్.టి.ఆర్, గోపీచంద్, కళ్యాణ్ రామ్, రాణా దగ్గుబాటి, రామ్ పోతినేని..ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలెవరైనా..అంతక ముందు ఎన్ని సినిమాలు చేసినా పూరి సినిమా తర్వాతే విపరీతమైన మాస్ ఇమేజ్ వచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేశ్ బాబులకి పూరి తో సినిమా చేశాకే మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్..మాస్ ఇమేజ్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో క్రేజ్ దక్కింది.
ఈ విషయాన్ని దర్శక దిగ్గజం రాజమౌళి ప్రేక్షకుల ముందు ఒప్పుకున్నారు. ఆయనలా నేను హీరోను చూపించలేనని. నేను ఒక్కో సీన్ నెలలు తీస్తే పూరి ఒక్కరోజులో రెండు మూడు సీన్స్ తీస్తారని..బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ సక్సెస్ చూస్తారని..ఆ ట్రిక్, సీక్రెట్ ఏంటో మీ దగ్గర ఓ రెండు రోజులు అసిస్టెంట్‌గా చేసి తెలుసుకోవాలని ఉందనే మాటను ఎంతో గర్వంగా చెప్పారు. నిజంగా అలా పూరి దగ్గర రాజమౌళి సహాయకుడిగా చేశారో లేదో తెలీదు గానీ యూట్యూబ్ లో ఈ వీడియో చూసినప్పుడల్లా దర్శకులకి, జనాలకి మాంచి కిక్ వస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.