Tollywood: ప్యాకేజీ స్టార్స్‌గా నయనతార, త్రిష..అవును ఇప్పుడు అటు తమిళంలో గానీ, ఇటు తెలుగులో ఈ ఇద్దరు భామలు డేట్స్ ఇవ్వాలంటే భారీ రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తోందట. అన్నీ కలిపి మంచి ప్యాకేజీ రూపంలో నయన్, త్రిషలకి నిర్మాతలు ముట్టచెబుతున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టి 15 ఏళ్ళకి పైగానే అయింది.
యంగ్ హీరోల నుంచి సీనియర్ స్టార్ హీరోల వరకూ దాదాపు అందరు సరసన నటించారు. కెరీర్ గ్రాఫ్ చూసుకుంటే నయన్, త్రిషలకి పెద్ద తేడా ఉండదు. ఇద్దరికీ మంచి సక్సెస్ రేట్ ఉంది. మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినా అవేవీ వీరి కెరీర్‌ని ఇబ్బందుల్లో పడేయలేదు. ఇప్పటికీ నయన్ డేట్స్ దొరకడం చాలా కష్టం. త్రిష ఒక్కో సినిమాను చాలా ఆలోచించి సెలెక్ట్ చేసుకుంటుంది. చేసిన సినిమా మంచి కాంబోలో ఉండాలని ఫిక్సైంది.
అందుకే, త్రిషకి మంచి డిమాండ్ ఉంది. ఇక త్రిష ఇటీవల లియో సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ సినిమాలో త్రిషని చూసిన వారు లవ్ లో పడకుండా ఉండలేరు. అంత అందంగా ఉంది. ఇప్పుడు అటు తమిళంలో ఇటు తెలుగులో త్రిష ని మేకర్స్ సీనియర్ హీరోల కొసం సంప్రదిస్తున్నారు. నయన్ కి అలాగే భారీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు వస్తున్నాయి. అట్లీ రూపొందించిన బాలీవుడ్ మూవీతో అక్కడ మంచి ఎంట్రీ ఇచ్చింది నయన్.
షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ నయనతారకి హిందీలో మంచి హిట్ దక్కేలా చేసింది. దాంతో అక్కడ కూడా నయన్ కి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ ఇద్దరికీ ప్రాజెక్ట్ గనక పాన్ ఇండియా లెవల్ లో రూపొందేదైతే 10 నుంచి 12 కోట్ల వరకూ నిర్మాతలు ఆఫర్ చేస్తున్నారట. ఈ రేంజ్ రెమ్యునరేషన్ సౌత్ లో కేవలం ఇద్దరే ఇద్దరికి ఉందని ఆ ఇద్దరూ నయనతార, త్రిష అని చెప్పుకుంటున్నారు.
Anil Ravipudi: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ మంచి సక్సెస్‌లను అందుకున్న సంగతి తెలిసిందే. నేను శైలజ…
Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన అవార్డు దక్కింది. తెలుగు చలన చిత్ర…
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ చిత్రంగా…
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
This website uses cookies.