Tollywood : అక్కినేని నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడంటూ తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి. సమంతతో ప్రేమ, పెళ్లి, విడాకులు తర్వాత అటు సమంత గానీ, ఇటు నాగ చైతన్య గానీ ఇంకా రెండో పెళ్లి చేసుకుంది లేదు. సమంత విషయంలో ఇప్పటి వరకూ రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు ఏవీ రాలేదు. కానీ, నాగ చైతన్య మాత్రం సెకెండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడంటూ ఇప్పటికే చాలాసార్లు వార్తలు వచ్చాయి.
గతంలో సాయి పల్లవి, కృతీశెట్టిల పేర్లు బాగా వినిపించాయి. ఆ తర్వాత తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ళ గురించి ఎక్కువగా వార్తలు వచ్చాయి. ఆ మధ్య నాగ చైతన్య-శోభిత కలిసి ఓ స్టార్ హోటల్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన పిక్స్ లీకై నెట్టింట తెగ హల్‌చల్ చేశాయి. ఇప్పుడు నిజంగానే చైతూ, శోభిత మూడుముళ్ళ బంధంతో ఒక్కటవబోతున్నారని తాజా సమాచారం. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ దాదాపు పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్టు చెప్పుకుంటున్నారు.
శోభిత ఇప్పటివరకూ నాగ చైతన్యతో కలిసి నటించలేదు. టాలెంటెడ్ హీరో అడివి శేష్ సరసన మాత్రం సినిమాలు చేసింది. ఇద్దరి మధ్య ముద్దు సన్నివేశాలూ ఉన్నాయి. వాస్తవానికి శేష్, శోభిత రిలేషన్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది. కానీ, అదంతా కేవలం గాసిప్స్ అని అసలు ప్రేమికులు నాగ చైతన్య-శోభిత అని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. మరి చైతూ ఎవరిని పెళ్లి చేసుకుంటాడనేది గోప్యంగా ఉంది. ఇక ఈ విషయంలో సమంత స్పందన కాస్త ఘాటుగానే ఉంటోంది. తనకి నచ్చినట్టు ట్విట్టర్‌లో పోస్ట్ పెడుతోంది.
కాగా, నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. చైతూ కెరీర్‌లో ఇది 23వ చిత్రం. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనుంది. మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుండగా నాగ చైతన్య, సాయి పల్లవి చేపలు పట్టే జాలరీల పాత్రల్లో అలరించనున్నారు. ఇలాంటి పాత్రలు చేయడంలో సాయి పల్లవి ఆరితేరింది. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన లవ్‌స్టోరీ మంచి హిట్ సాధించింది.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.