Tollywood : సీనియర్ నటి నగ్మాతో ప్రముఖ నటుడికి ఎఫైర్ ఉందని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. చెప్పాలంటే ఇది గతంలోనూ ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై నటుడు స్పందించాడు. తెలుగులో నగ్మా స్టార్ హీరోయిన్‌గా 90ల దశకంలో ఓ వెలుగు వెలిగింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, వెంకటేష్, నాగార్జున, సుమన్ లాంటి సీనియర్ స్టార్స్ అందరి సరసన నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది.
తమిళంలో పాటు మిగతా సౌత్ భాషలలోనూ నగ్మాకి మంచి క్రేజ్ ఉండేది. అయితే, ఈ స్టార్ హీరోయిన్‌కి భోజ్‌పురికి చెందిన ప్రముఖ నటుడు రవికిషన్‌తో ప్రేమాయణం సాగిందని అప్పట్లో బాగా వార్తలు వినిపించాయి. రవికిషన్ భోజ్‌పురి భాషలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ముఖ్యంగా నగ్మా కాంబినేషన్‌లో చాలా సూపర్ హిట్ సినిమాలొచ్చాయి. ఇద్దరి మధ్య మంచి అనుబంధం కూడా ఉంది. ఇప్పటికీ మంచి స్నేహితులుగా ఉంటున్నారు.
రవికిషన్ బీజేపీ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. నగ్మా కూడా అదే పార్టీలో ఉండటం వల్ల ఇద్దరిమధ్య బంధం ఇంకాస్త బలపడింది. ఇదంతా జనాలకి మరోలా అర్థమయింది. అందుకే, నగ్మా రవికిషన్‌ల మధ్య ఏదో రిలేషన్ ఉందని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇటీవల మీడియా ఇంటర్వ్యూలో విలేఖరి అడిగిన ప్రశ్నకి రవికిషన్ క్లారిటీ ఇచ్చాడు.
మేమిద్దరం కలిసి ఒకే భాషలో పలు చిత్రాలు చేశాము. మాది మంచి స్నేహబంధం. అంతే తప్ప ఇంక ఎలాంటి రిలేషన్ లేదని తేల్చిపారేశాడు. ఇదే సమయంలో తన భార్య సపోర్ట్ పూర్తిగా ఉందని..జీరో నుంచి ఈ స్థాయికి వచ్చే వరకూ ఎంతో సహకరించింది. ఆమె అంటే నాకెంతో గౌరవం. అని రవికిషన్ తన భార్య గురించి గొప్పగా చెపాడు. దాంతో ఇన్నాళ్ళు రవికిషన్‌కి నగ్మాతో ఎఫైర్ ఉందని వస్తున్న వార్తలకి చెక్ పెట్టినట్టైంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.