Tollywood Exclusive: ప్రభాస్ ‘రాజు’ ని టచ్ చేసేదెవరు..?

Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం చుట్టారు. ‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్న జయంత్ సి పరాన్‌జీ దర్శకుడు. అయితే, ఈ సినిమాలో హీరో ఎవరనేది మాత్రం క్లారిటీ లేదు. అప్పటికే, చాలామందిని అనుకున్నారు. కానీ, కథకి తగ్గట్టుగా ఎవరూ సెట్ అవలేదు. ఈ ప్రయత్నంలోనే ఓ కాఫీ షాప్ లో ప్రభాస్ ‘రాజు’ను చూశారు మేకర్స్.

అతనే మన సినిమాలో హీరో అనుకున్నారు. ఆరా తీస్తే రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి వారసుడు అని తెలిసింది. అంతే, వెంటనే వెళ్ళి కలవడం ప్రభాస్ ‘రాజు’ హీరోగా సినిమా అనౌన్స్ అవడం జరిగాయి. అదే 2002 లో వచ్చిన ‘ఈశ్వర్’. ఇదే సినిమాతో సీనియర్ నటీనటులు మంజుల, విజయ్ కుమార్‌ల కూతురు శ్రీదేవీ వెండితెరకి హీరోయిన్‌గా పరిచయం అయింది.

tollywood-exclusive-who-will-touch-prabhas-raju
tollywood-exclusive-who-will-touch-prabhas-raju

Tollywood Exclusive: ప్రభాస్ ‘రాజు’ విషయంలో అలా జరగలేదు.

సినిమా యావరేజ్ టాక్ అన్నప్పటికీ ప్రభాస్ ‘రాజు’కి మంచి లాంఛింగ్ ఫిల్మ్ అని మాత్రం ఇండస్ట్రీతో పాటు కృష్ణంరాజు గారి అభిమానులు చెప్పుకున్నారు. ఆ తర్వాత ‘రాఘవేంద్ర’ వచ్చింది. సినిమా డిజాస్టర్. కానీ, ప్రభాస్ పర్ఫార్మెన్స్ కి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ కొడుకైనా వరుసగా రెండు ఫ్లాపులు పడితే మొహమాటం లేకుండా పక్కన పెడతారు.

tollywood-exclusive-who-will-touch-prabhas-raju
tollywood-exclusive-who-will-touch-prabhas-raju

కానీ, ప్రభాస్ ‘రాజు’ విషయంలో అలా జరగలేదు. ఈశ్వర్ సినిమా చూసిన వెంటనే అగ్ర నిర్మాత అయిన ఎమ్మెస్ రాజు గారు ప్రభాస్ డేట్స్ లాక్ చేసుకున్నారు. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కి 2004 వ సంవత్సరం రిలీజై బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమానే ‘వర్షం’. త్రిష హీరోయిన్‌గా గోపీచంద్ నెగిటివ్ రోల్ లో కనిపించారు. నిర్మాత ఎమ్మెస్ రాజుకి భారీ కమర్షియల్ హిట్ దక్కింది.

tollywood-exclusive-who-will-touch-prabhas-raju
tollywood-exclusive-who-will-touch-prabhas-raju

ప్రభాస్ ‘రాజు’ కి మంచి కథ సెట్ అయితే బాక్సాఫీస్ లెక్కలెలా ఉంటాయో నిరూపించింది ‘వర్షం’. ఆ తర్వాత పెద్ద నిర్మాణ సంస్థలు, దర్శకులు ప్రభాస్ కి తగ్గ కథలను తయారు చేసుకునే పనిలో పడ్డారు. డేట్స్ కోసం క్యూ కట్టారు. మధ్యలో ఫ్లాప్స్ వచ్చిన అవి ప్రభాస్ ‘రాజు’ మార్కెట్‌ని ఏమాత్రం తగ్గించలేకపోయాయి.

‘అడవిరాముడు’, ‘చక్రం’ సినిమాలతో ఇంకా నటన పరంగా మెరగయ్యారు ప్రభాస్. అదే సమయంలో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ‘ఛత్రపతి’ సినిమాను తీసి ఆయన క్రేజ్ ని మరింత పెంచారు. పక్కా కమర్షియల్ హీరో అని మాత్రమే కాకుండా యాక్షన్ సినిమాలకి సరిపడే కటౌట్ అని నిరూపించారు. ‘పౌర్ణమి’, ‘యోగి’, ‘మున్నా’, ‘బుజ్జిగాడు’, ‘బిల్లా’, ‘ఏక్ నిరంజన్’..ఇలా వరుసగా ప్రభాస్ రాజుకి ఫ్లాపులుగా మిగిలాయి. కానీ, ఎక్కడా హీరో ఇమేజ్ డ్యామేజ్ కాలేదు.

tollywood-exclusive-who-will-touch-prabhas-raju
tollywood-exclusive-who-will-touch-prabhas-raju

ఆ తర్వాత వచ్చిన ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్న ప్రభాస్ రాజు మళ్ళీ ‘రెబల్’ సినిమాతో పరాజయాన్ని చూడాల్సి వచ్చింది. అయితే, ‘మిర్చి’ మళ్ళీ సాలీడ్ హిట్ ఇచ్చి గత చిత్రాల తాలూకా ప్రభావాన్ని చెరిపేసింది. ప్రభాస్ ‘రాజు’ కెరీర్ ఇప్పటి వరకూ ఒకెత్తైతే ఇక్కడ్నుంచి ఆయన ఇమేక్ ప్రపంచదేశాలకీ చేరువైంది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ భాగాలు ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చాయి.

tollywood-exclusive-who-will-touch-prabhas-raju
tollywood-exclusive-who-will-touch-prabhas-raju

చైనా, జపాన్ వంటి దేశాలలో ప్రభాస్ ‘రాజు’ కి అభిమానులు, అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. ఏకంగా ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ ఊరు మొత్తం సినిమా పోస్టర్స్ ని షర్ట్ పైనా, టీ-షర్ట్స్ పైనా ప్రింట్ చేసుకొని ప్రచారం చేశారు. ‘బాహుబలి’ సినిమాల తర్వాత ప్రతీ హీరో ప్రభాస్ ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని అదే రేంజ్ కి పోటీ పడటం మొదలు పెట్టారు.

మన తెలుగు సినిమా స్థాయి చెప్పిన హీరో ప్రభాస్ అని గర్వంగా చెప్పుకున్నారు. ‘సాహో’, ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’, ‘సలార్’ సినిమాలన్నీ ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్ మార్కెట్ మాత్రం పెంచుతూ వచ్చాయి. ‘సలార్’, ‘కల్కీ’ సినిమాలను చూస్తే హాలీవుడ్ హీరోలకే అసూయ కలుగుతుంది. ఇప్పుడు ఇటు సౌత్ భాషలలోనే కాదు అటు బాలీవుడ్ లోనూ ప్రభాస్ ని ఫాలో అవుతున్న హీరోలు చాలామంది ఉన్నారు.

tollywood-exclusive-who-will-touch-prabhas-raju
tollywood-exclusive-who-will-touch-prabhas-raju

ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’, ప్రశాంత్ నీల్ తో ‘సలార్ 2’, చేస్తున్నారు. ఒక్క హోంబలే సంస్థ వారే ప్రభాస్ తో మూడు భారీ చిత్రాలను చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారంటే ప్రభాస్ రేంజ్ ఏంటో ఊహించుకోవచ్చు. అంతేకాదు, ఈ మూడు సినిమాలకి గాను ఆయన రెమ్యునరేషన్ 600 కోట్లు అని కూడా చెప్పుకుంటున్నారు. ఈ గ్రాఫ్ చూసి ‘ప్రభాస్ రాజు’ ని టచ్ చేయడం ఇప్పట్లో ఎవరి వల్లా కాదంటున్నారు సినీ విశ్లేషకులు, అభిమానులు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Pawan Kalyan: అన్నీ వరుసబెట్టి పూర్తి చేస్తున్న పవర్ స్టార్..!

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో చాలా బిజీగా ఉన్నారు. ఎక్కువగా…

23 hours ago

The Raja Saab: ఫ్రభాస్ వల్లే ఆలస్యమవుతుందా..?

The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ సినిమాల కోసం ఆయన అభిమానులే కాదు, సినీ ప్రేమికులు ఎంతో…

23 hours ago

Puranapanda Srinivas : అభయ గణపతి ఆలయదర్శనమే అమోఘం

Puranapanda Srinivas : హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని,…

1 week ago

PURANAPANDA SRINIVAS : పురాణపండకు త్యాగరాయ గానసభలో దక్కిన ఘనత!

PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…

4 weeks ago

Ram Charan: ఊహించని రేంజ్‌లో ‘పెద్ది’ ఫస్ట్ షాట్..’పుష్ప’ రికార్డ్స్ బద్దలు..!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…

1 month ago

Sreeleela: డార్జిలింగ్‌ లో యంగ్ హీరోయిన్‌కి చేదు అనుభవం..

Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్‌ ముగిసిన…

1 month ago