Tollywood : మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ సహా మిగతా ఇండస్ట్రీలలోనూ స్టార్ హీరోలు 60కై పైబడిన స్టార్ హీరోలు జుట్టుకు రంగేసుకొని 40 ఏళ్ళ వయసున్నవారిలా రెచ్చిపోతున్నారు. ఇది ఆయా హీరోల ఫ్యాన్స్ వరకూ బాగానే ఉన్నా, విమర్శకుల నుంచి మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. మన సీనియర్ హీరోలు ఇంకా హీరో వేశాలకి ఫుల్ స్టాప్ పెడితే బావుంటుందేమో..! అని కామెంట్స్ చేస్తున్నారు.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గత కొంతకాలంగా ఆయన వయసుకు తగ్గ కథలను ఎంచుకుంటూ సక్సెస్ చూస్తున్నారు. పింక్, బద్లా లాంటి సినిమాలు బిగ్ బి కి మంచి పేరును తెచ్చిపెట్టాయి. అయితే, మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్, లేటు వయసులోనూ రొమాన్స్, యాక్షన్, ఫైట్స్, ఛేజింగ్స్ అంటూ అవస్థలు పడుతున్నారు.
ఫ్యాన్స్ ని మెప్పించడానికి చేస్తున్నారనే విషయం ఇక్కడ క్లియర్‌గా తెలుస్తోంది. అదే ఫ్యాన్స్ కోసం కథా బలమున్న సినిమాలు చేస్తే గ్రాఫ్ ఇంకోలా ఉంటుంది. హీరోగా కాకుండా ఓ నాయకుడిగా కనిపించే పాత్రలు మన సీనియర్ హీరోలకి బాగా సూటవుతాయి. ఓ సైంటిస్ట్ గానో, డిటెక్టివ్ పాత్రలలోనో, సీబీఐ ఆఫీసర్ పాత్రల్లోనూ కనిపించి కథా మొత్తం తమ చుట్టూ తిప్పుకోవచ్చు. కానీ, మాసీవ్ రోల్స్ వేయాలి..హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయాలి.
కొడితే ఒకేసారి పదిమంది విలన్లు ఎగిరెళ్ళి ఎక్కడో పడాలి. ట్రైన్ తో పాటుగా ఛేజింగ్ సీన్స్ చేయాలి. కానీ, ఇలాంటివి ఫ్యాన్స్ కే రుచించడం లేదు. ఇక కామన్ ఆడియన్స్ కి ఎంతమాత్రం నచ్చుతుందో బేరీజు వేసుకోవాలి. ఇటీవల కాలంలో మన సీనియర్ హీరోలు నటించిన చాలా సినిమాలు ఫ్లాపవడానికి కారణం వాళ్ల వయసుకు తగ్గ కథలను ఎంచుకోకపోవడమే. అప్పుడెప్పుడో వెంకటేశ్ గురు అనే సినిమా చేశారు.
ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధించించో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్ అంటూ హీరోయిన్‌తో రొమాన్స్ చేసే సినిమా కాకుండా ప్రేక్షకులు మెచ్చే సినిమా చేసి ప్రశంసలు అందుకున్నారు. ఇలాంటి కథలే ఇప్పుడు జనాలకి కావాల్సింది. మొహం మీద ముడతలు కనిపిస్తున్నా గ్రాఫిక్స్ లో కవర్ చేస్తున్నారు. కానీ, యాక్టింగ్‌లో ఆ వయసు ప్రభావం కనిపిస్తుంది కదా. ఇంకా ఎప్పటికి తెలుసుకుంటారో మన సీనియర్ హీరోలు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.