Today Horoscope : బుధవారం 05-04-2023 న 12 రాశులలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది. ఎవరికి ఈ వారం కలిసి వస్తుంది. ఎవరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఎలాంటి కార్యక్రమాలు చేప్పటవచ్చు వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
మేషం :
ఈ రాశి వారికి ఈ రోజు చాలా సానుకూలంగా ఉంది. తమ భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేస్తారు. ముఖ్యంగా ఈ రోజు బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. శత్రువులు మీపై ఏ కుట్రలు చేసిన మీరే విజయం సాధిస్తారు. ఓ సంఘటన మీకు చాలా బాధ కలిగిస్తుంది. అయినప్పటికీ దాని నుంచి మీరు తేరుకోగలుగుతారు. శుభ ఫలితాల కోసం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ఉత్తమమైన పరిష్కారం .
వృషభం :
ఈ రాశి వారు ఆత్మస్థైర్యంతో తమ ప్రయాణం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనోధైర్యంతోనే మీరు విజయాన్ని సాధిస్తారు. మీకు కాస్త అలసట పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. అయినప్పటికీ కూడా మీరు ముందుకు సాగుతారు. కొన్ని కొన్ని వ్యవహారాల్లో చాలా తెలివి తక్కువగా ఆలోచిస్తారు. విష్ణు నామస్మరణను చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.
మిథునం :
ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు చేపట్టిన పనుల్లో కాస్త ప్రతికూలత పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అయినప్పటికీ మీరు పట్టుదలతో వాటిని అధిగమించి ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం వల్ల మీరు ఇంట్లో గెలుపును సాధిస్తారు. శివారాధనలు చేయడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు.
కర్కాటకం :
ఈ రాశి వారికి ఈ రోజు సానుకూలంగా ఉంది. ఆశించిన ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కీలకమైన నిర్ణయాల్లో మీరు విజయాన్ని సాధిస్తారు. మీరు ఏ పని చేపట్టినా దానికి తిరుగు ఉండదు. శని శ్లోకాన్ని పట్టించడం శుభదాయకం.
సింహం :
ఈ రాశి వారికి కూడా ఈరోజు చాలా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శారీరక శ్రమ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేయని పొరపాటుకు మీరు నిందపడాల్సి వస్తుంది. కాబట్టి ఆచి తూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని విపత్కర పరిస్థితులు ఏర్పడిన కూడా మీ మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. వారితో ఏ మాట మాట్లాడినా ఆచితూచి వ్యవహరించండి. నవగ్రహాల స్తోత్రం పారాయలు చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.
కన్య :
ఈ రాశి వారికి ఈ రోజు చాలా అద్భుతంగా ఉంది. బంధువులతో ఆహ్లాదకరంగా గడుపుతారు. కానీ వారితో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోబలం తగ్గకుండా మీ పనుల్లో మీరు విజయాలను సొంతం చేసుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనుల్లో మీకు అభివృద్ధి కనిపిస్తోంది. ఇష్టాదైవారాధన చేయడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు.
తుల :
ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. చేపట్టే పనిలో కాస్త ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు పట్టుదలతో వాటిని అదిగమిస్తారు ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమ పెట్టాల్సిన అవసరం ఉంది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా మీరు ఎలాంటి తడబాటుకు లోను కాకూడదు. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటే మంచిది. గణపతిని ఆరాధించడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు
వృశ్చికం :
ఈ రాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంది. కొన్ని కీలకమైన విషయాల్లో మీ పై అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల మీకు మేలు జరుగుతుంది. కొన్ని కీలకమైన విషయాల్లో వారి సూచనలు కూడా మీకు ఫలిస్తాయి. సుబ్రమణ్య స్వామి అష్టోత్తర శతనామావళిని పాటిస్తే చక్కటి ఫలితాలను పొందవచ్చు.
ధనుస్సు :
ఈ రాశి వారికి ఈ రోజు సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని కీలకమైన విషయాలను మీరు పూర్తిచేయగలుగుతారు. కొంతమంది మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తుంటారు. వారి వారి ఆలోచనలు ఏంటో మీరు పసిగట్టి అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు విష్ణు సహస్రనామాలు చదవడం వల్ల చక్కటి ఫలితాలు పొందవచ్చు .
మకరం :
మీ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అనుకునే మనస్తత్వం కలిగిన వారు మీరు. ఓ సమస్య నుంచి బయట పడి మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం వల్ల ప్రశాంత లభిస్తుంది. మీ ప్రయాణంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒక వార్త చాలా బాధిస్తుంది. కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
కుంభం :
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏ పని చేపట్టినా కూడా ఆటంకాలు ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా అధిగమించే ప్రయత్నం మీరు చేస్తారు. శ్రమ పడకుండా కాస్త జాగ్రత్తగా వహించాలి మానసికంగా మీరు దృఢంగా ఉండాలి. అష్టమచంద్ర సంచారం అనుకూలంగా లేదు. కాబట్టి దుర్గా స్తోత్రం చదవడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.
మీనం :
ఈ రాశి వారికి ఈ రోజు సానుకూలంగానే ఉంది. బంధుమిత్రులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతారు. శ్రమకు తగిన ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. చేపట్టే పనులు త్వరగా పూర్తీ చేసే విధంగా కూడా మీరు చక్కటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం చదవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.