Today Horoscope : ఆదివారం 11-03-2023 రోజున 12 రాశులలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది. ఎవరికి ఈ రోజు కలిసి వస్తుంది. ఎవరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
మేషం :
మేష రాశి వారికి ఇది మంచి కాలం. ఈరోజు వీరికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఉద్యోగం చేసేవారు అయితే మీ పని పట్ల మీ పై అధికారులు సంతృప్తిగా ఉంటారు. వారి నుంచి మీరు ప్రశంసలు పొందుతారు.మీ పనిని గౌరవించి దాన్ని గుర్తించి మిమ్మల్ని సత్కరిస్తారు. మీకు చుట్టుపక్కల వారి సహకారం కూడా ఉంటుంది. మీ సన్నిహితులు మీకు మేలు చేస్తారు. మీకు అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ విష్ణు నామాన్ని పటించడం మంచిది.
వృషభం :
ఈ రాశి వారు ఈ రోజు ఓ శుభవార్త వింటారు. ఆ వార్త మీ ఇంటి వారందరికీ సంతోషాన్ని అందిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న మీ పని ఏదైనా సరే మీరు పెట్టుకున్న టార్గెట్ ను రీచ్ అవుతారు. ఈ విషయంలో సంతృప్తిగా ఉంటారు. ఈరోజు అంతా కూడా మీరు విందు, వినోదం మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.
మిథునం :
రోజు చేస్తున్న పని అయినప్పటికీ కూడా కాస్త శ్రమ పెరుగుతుంది. అయినా ఉత్సాహం ఏ మాత్రం తగ్గకుండా మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. బంధువులతో చిక్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారితో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయస్వామి నామాన్ని పటించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
కర్కాటకం :
ఈ రాశి వారికి మనోధర్యం అధికం. ఏ పనైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్లి దాన్ని పూర్తి చేస్తారు. ఈరోజు మీ ఇష్టమైన వారిని కలుస్తారు వారితో సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా మీ శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. ప్రయాణించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. శ్రీ వేంకటేశ్వర స్వామి నామస్మరణం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
సింహం :
ఈ రాశి వారికి బంధుమిత్రుల సహకారం తక్కువే అయినప్పటికీ కూడా కొన్ని పనులు ప్రారంభించి పూర్తి చేయాలని ప్రయత్నిస్తారు. రెట్టించిన ఉత్సాహంతో మీ పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. సమయానికి ఆహారం తినాలి నిద్రపోవాలి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. గో సేవ చేస్తే కాస్త ప్రశాంతత లభిస్తుంది.
కన్య :
ఈ రాశి వారు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది.కాస్త శ్రమించినా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పరిస్థితి ఏదైనా మనోధైర్యాన్ని కోల్పోతారు. దైవారాధన ఉత్తమం.
తుల :
ఏ పని చేపట్టినా ముందు చూపుతో వెళ్ళాలి శ్రమ అధికంగా ఉంటుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కీలకమైన విషయాల్లో నిపుణుల సూచనలు తీసుకోవడం శ్రేయస్కరం.హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయస్వామి నామాన్ని పటించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
వృశ్చికం :
ఈ రాశి వారికి ఇది మంచి కాలం. ఈరోజు వీరికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. సమయానికి సహాయం అందుతుంది. ధన వృద్ధి పుష్కలంగా ఉంటుంది. ఈరోజు చేపట్టే శుభకార్యాలలో మీరు పాల్గొంటారు. ఓ సంతోషకరమైన వార్తను వింటారు. శివనామస్మరణ చేయడం ఉత్తమం.
ధనుస్సు :
ఈ రాశి వారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు మీరు శుభవార్త వింటారు అది మీ ఇంటిలోని వారిని ఆనందంగా ఉంచుతుంది. మీరు శుభకార్యంలో పాల్గొంటారు. బంధుమిత్రుల సహకారం కూడా పుష్కలంగా లభిస్తుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇష్ట దైవారాధన చేయండి.
మకరం :
మీరు ఏదైనా పని చేపట్టి దాని ఫలితం ఎదురు చూస్తున్నట్లయితే అందులో మీరు సత్ఫలితాలను పొందుతారు. ఓ విషయంలో మీకు సహకారం అందుతుంది శుభవార్తను మీరు వింటారు. మీకు దైవబలం పుష్కలంగా ఉంది ఇష్టమైన దైవాన్ని ఆరాధించడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు
కుంభం :
మీకు పట్టుదల అధికం ఆ పట్టుదల నుంచి మీరు చేపట్టిన పనులను పూర్తిచేస్తారు భవిష్యత్తు గురించి ముందు నుంచి ఆలోచిస్తారు అందుకు తగ్గట్లుగా ప్రణాళిక రచిస్తారు. ఓ శుభవార్త మీ మనో బలాన్ని పెంచుతుంది. కొన్ని కొన్ని సార్లు అస్థిరమైన మనస్తత్వంతో ఉంటారు దానివల్ల చిక్కులను తెచ్చుకుంటారు వాటిని తప్పించుకునేందుకు మీరు గోవింద నామాలు చదవటం ఉత్తమం.
మీనం :
మీ ప్రతిభకు పని తీరుకు మీ పై అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు. మీరు ఎప్పటినుంచో చేయాలి అని అనుకుంటున్నా ఓ ముఖ్యమైన కార్యక్రమం పూర్తి కావస్తుంది. కొన్ని కొన్ని ముఖ్యమైన సందర్భంలో పెద్దలను ఆశ్రయిస్తారు.మహాలక్ష్మి అష్టోత్తరం చదవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.