Today Horoscope : సోమవారం 13-03-2023 రోజున 12 రాశులలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది. ఎవరికి ఈ రోజు కలిసి వస్తుంది. ఎవరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేప్పటవచ్చు వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
మేషం :
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగం చేసే వారు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా గొడవలు జరిగే అవకాశం ఉంది. చేపట్టిన పనులు తొందరగా పూర్తి కావు. ఇబ్బందులు ఎదురవుతాయి. నైపుణ్యతను ప్రదర్శించడం వల్ల చాలా వరకు సమస్యలను తరిమికొట్టవచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి.దుర్గా ధ్యానం చేయడం వల్ల చాలా వరకు సమస్యలను తరిమి కొట్టవచ్చు.
వృషభం :
ఈ రాశి వారికి ఈ రోజు తిరుగుండదు. వృషభ రాశి వారికి మంచి రోజులు నడుస్తున్నాయి. వీరు తలపెట్టిన ప్రతి పనిలో సత్ఫలితాలు సాధిస్తారు. తమ పనితీరుతో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో సానుకూల ఫలితాలు ఉన్నాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. శివుని దేవాలయాన్ని సందర్శిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
మిథునం :
ఈ రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. చేపట్టిన ప్రతి పనిలో సత్ఫలితాలు సాధిస్తారు. ఒక శుభవార్త వింటారు అది మీ కుటుంబానికి సంతోషాన్ని కలిగిస్తుంది. మంచి రోజులు నడుస్తున్నాయి,వ్యాపారం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. మీ టాలెంట్ తో అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి చూపిస్తారు. సంతోషంగా గడుపుతారు. మీకు అనుకూలమైన కాలాన్ని మంచి పనులకు ఉపయోగించండి. ఆంజనేయస్వామి ని సందర్శించడం వల్ల మంచి ఫలితాలున్నాయి.
కర్కాటకం :
ఈ రాశి వారు తమ ధర్మానుసారంగా నడుస్తారు. ఉద్యోగం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. తమ బుద్ధి బలానికి తోడు దైవ బలంతో చేపట్టిన కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇష్టమైన దైవాన్ని ఆరాధించడం వల్ల శుభం కలుగుతుంది.
సింహం :
ఈ రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ చేపట్టిన కార్యక్రమాల్లో నిర్లక్ష్యం అలసత్వం ప్రదర్శించకండి. విపత్కర పరిస్థితులలోనూ మనో ధైర్యంతో ముందుకు సాగితే సత్ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. గో సేవ ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.
కన్య :
ఈ రాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిత్తశుద్ధితో పనుల్లో ముందుకు వెళితే సత్ఫలితాలను పొందే అవకాశం ఉంది. చేపట్టే పనుల్లో చాలా ఆటంకాలు ఎదురవుతాయి అయినప్పటికీ వాటిని ఏ విధంగానైనా పరిష్కరించాలనే ధోరణితో ముందుకు వెళ్తారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకూడదు. లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
తుల :
ఈ రాశి వారికి ఈ రోజు శ్రమ అధికం. మీరు చేసే పనుల్లో తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.తొందరపాటు నిర్ణయాల వల్ల ఒత్తిడికి లోనవుతారు. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ధైర్యంగా ముందుకు వెళ్తారు.ఏ పని చేపట్టిన మానసిక ప్రశాంతతతో చేయండి. వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
వృశ్చికం :
ఈ రాశి వారు ఎంత శ్రమిస్తే అంత మంచి ఫలితాలను పొందుతారు. శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోటి వారి సహకారంతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. వెంకటేశ్వర స్వామిని ఆరాధించిన వల్ల సత్ఫలితాలను పొందవచ్చు.
ధనుస్సు :
ఏ పని చేసినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేయండి తొందరపాటు నిర్ణయాల వల్ల చిక్కులు ఎదురవుతాయి. ఈ రాశి వారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. అనవసర ఖర్చులవైపు మనసు లాగుతుంది మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం అవసరం వీలైనంత వరకు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం ఉత్తమం. లక్ష్మీ గణపతిని ఆరాధించడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.
మకరం :
ఈ రాశి వారికి ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొని సంతోషంగా గడుపుతారు. ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల సత్ఫలితాలను పొందవచ్చు.
కుంభం :
ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది చేపట్టే ప్రతి పనిలో సత్ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేస్తారు. మీ ఇంటికి కొత్త వస్తువుల రాక మీద ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి సానుకూలంగా ఉన్నప్పటికీ విష్ణు సహస్రనామాలు పట్టించడం వల్ల మరింత మెరుగైన ఫలితాలను పొందవచ్చు
మీనం :
మీరు కోరుకున్నది మీకు లభిస్తుంది. అందులో మీరు సంతృప్తిని పొందుతారు. మీరు పనిచేసే రంగాల్లో కొంతమంది అందించే సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. కొన్ని విషయాల్లో వాదనకు పోకుండా సర్దుకుపోవడం మంచిది. దుర్గాదేవిని ధ్యానం చేయడం వల్ల శుభం కలుగుతుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.