Categories: DevotionalNews

Tirumala: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసిన టీటీడీ… సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ చివరి గడువు ఎప్పుడంటే..?

Tirumala: కలియుగ దైవం అయిన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేద సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకుంటారు. పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని ఇలవైకుంఠంగా పరిగణిస్తారు. కోరిన కోరికలు తీర్చే శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రజలు సుదూర ప్రదేశాల నుండి తిరుమలకు చేరుకుంటారు. అయితే భక్తుల సౌకర్యం టిటిడి ఎప్పటికప్పుడు అనేక సేవా కార్యక్రమాలను చేపడుతోంది. తాజాగా టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జూలై నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఇటీవల విడుదల చేసింది. అయితే ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని టిటిడి స్పష్టం చేసింది.

సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం నమోదు చివరి గడువు రోజున మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయి. అయితే ఈ టికెట్లు పొందిన వారు టిటిడి నిర్ణయించిన ధర చెల్లించి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా జూలై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఏప్రిల్ 21 న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అలాగే కోటా:వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఉచిత దర్శనం కోసం మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఏప్రిల్ 21 న మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

Tirumala:

అలాగే మే, జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటుగా తిరుమలలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 26న ఉదయం 10 గంటలకు, అలాగే తిరుపతిలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 27న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి ని దర్శించుకోవాలనుకునే భక్తులు టీటీడీ వెబ్ సైట్ తో పాటుగా టీటీడీ యాప్ లో ఈ ఆన్ లైన్ కోటా ప్రత్యక ప్రవేశ దర్శనం టికెట్ల తో పాటు వసతి కోటాను బుక్ చేసుకోవచ్చని టీటీడీ వెల్లడించింది.

Sravani

Recent Posts

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

2 days ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

3 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

4 weeks ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

4 weeks ago

This website uses cookies.