Tirumala: దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలు, ఫాస్టాగ్‌లపై కేంద్ర ప్రభుత్వం తరచూ కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు మరింత సజావుగా సాగాలని ఉద్దేశించిన ఈ చర్యలు, మరోవైపు వాహనదారులపై భారంగా మారుతున్నాయి. ప్రస్తుతం అన్ని టోల్ ప్లాజాలలో వాహనాల నుంచి ఫాస్టాగ్ విధానంతో టోల్ వసూలు జరుగుతున్నా, వాస్తవంగా వాహనాలను నిలిపివేయాల్సిన పరిస్థితి తప్పడం లేదు.
ఫాస్టాగ్ రీడర్లు పనిచేయకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడం వంటివి తరచూ జరుగుతుండటంతో, కొన్ని సందర్భాల్లో టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు క్యూల్లో నిలబడుతున్నాయి. ఫాస్టాగ్ ఉన్నా కూడా రాకపోకలు అంత సజావుగా లేవన్న అభిప్రాయం కేంద్రానికి వచ్చింది. దీంతో కేంద్రం కొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది.
ఇకపై వాహనదారులకు వార్షిక టోల్ పాస్ సౌకర్యం లభిస్తుంది. దీని ధర రూ.3,000గా నిర్ణయించబడింది. పాస్ కొన్న తేదీ నుంచి ఏడాది పాటు లేదా గరిష్టంగా 200 ట్రిప్పుల వరకు ఇది చెల్లుతుంది. అయితే ఈ సదుపాయం కేవలం నాన్-కమర్షియల్ వాహనాలకు (కార్లు, జీపులు, వ్యాన్లు) మాత్రమే వర్తిస్తుంది. కమర్షియల్ వాహనాలకు ఈ పాస్ వర్తించదు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి రానున్నట్టు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
ఇదే తరహాలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కూడా ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసింది. ఈ నెల 15 నుంచి అలిపిరి చెక్‌పోస్ట్ వద్దకు వచ్చే అన్ని వాహనాలకు ఫాస్టాగ్ ఉండాలి. భద్రత, రద్దీ తగ్గింపు, పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ తెలిపింది. ఇకపై ఫాస్టాగ్ లేని వాహనాలను తిరుమల గిరి ప్రాంతంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది.
అదేవిధంగా ఫాస్టాగ్ లేని వాహనదారుల కోసం అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద ఐసీఐసీఐ బ్యాంకు సహకారంతో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసింది. అక్కడ భక్తులు తక్కువ సమయంలోనే ఫాస్టాగ్ పొందవచ్చు. దానిని పొందిన తర్వాత మాత్రమే వాహనాలతో తిరుమలకు వెళ్లే అవకాశం ఉంటుందని టీటీడీ ప్రకటించింది. భక్తులు ఈ విషయంలో సహకరించాలని కోరింది.
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…
This website uses cookies.