Categories: HealthLatestNews

Health Tips: ఒక్క కట్ట చుక్కకూర ఎన్ని వ్యాధులను నయం చేస్తుందో తెలుసా..?

Health Tips: మనం రోజువారి ఆహారంలో ఆకు కూరలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. చిన్నవాళ్ల నుంచి పెద్దవారి వరకు ఆకుకూర లను అధికంగా తీసుకోవాలని డాక్టర్లు చెబుతుంటారు. అంటే ఆకుకూరల్లో ఎన్నో ప్రయోజనాలున్నాయని దీనర్థం. ఇలా మనం ఆహారంలో తీసుకునే ఆకుకూరలలో చుక్కకూరతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. కానీ, మనలో చాలామందికి వీటి గురించి తెలీదు. ఎప్పుడూ ఒకే ఆకుకూర తీసుకుంటే విసుగ్గా ఉంటుందనే ఒక్కోసారి ఒక్కో కూరను తింటుంటారు.

అయితే, చుక్కకూర వల్ల మనలో సహజంగా వచ్చే కొన్ని వ్యాధుల నుంచి లక్షలు ఖర్చు చేసిన తగ్గనిది కేవలం ఈ ఆకు రసం ఉపయోగించి నయం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ వ్యాధులేంటో వాటికి చుక్కకూరను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

this one leafy vegetable cures many diseases

చుక్కకూర కాస్త అటు ఇటుగా గోంగూర మాదిరిగా పులుపుదనం కలిగి ఉంటుంది. చుక్కకూరను పప్పులో, మిగతా కూరలతో కలిపి వండుకుంటుంటారు. చుక్కకూర పచ్చడి చేసుకునేవారు చాలామంది ఉన్నారు. దీనిలో పీచుపదార్థం (ఫైబర్ కంటెంట్) అధికంగా లభిస్తుంది. దీనివల్ల భోజనం త్వరగా అరుగుదల కానివారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాదు, కడుపు ఉబ్బరంగా ఉన్నా నివారిస్తుంది. ఒక కట్ట చుక్కకూరలో 123 మిల్లీ గ్రాముల కాల్షియం శరీరంలోకి వెళుతుంది. చుక్కకూర వల్ల కాల్షియం మనలో అదికంగా చేరి ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. అందుకే ఎదిగే పిల్లలకు ఎక్కువగా చుక్కకూరతో చేసిన వంటకాలను ఆహారంలో ఉండేలా చూసుకుంటారు.

Health Tips: ఈ ఆకుకూర చుక్కలను చెవిలో వేసుకుంటే నొప్పినుంచి ఉపశమనం..

కిడ్నీ సమస్యకు చుక్కకూర బాగా పనిచేస్తుంది. పొట్టకు సంబంధించిన సమస్యలను అదుపులో ఉండేల చేస్తుంది. ఇక చుక్కకూరలో ఇనుము శాతం కూడా అధికంగా లభిస్తుంది. దీనివల్ల శరీరంలోని ఎర్ర రక్త కణాలు బాగా మెరుగుపడతాయి. ముఖ్యం గా చుక్కకూరను ఎండాకాలంలో వారంలో మూడుసార్లు తినడం వల్ల ఒంట్లో ఉండే వేడిని తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతేకాదు పాలలో చుక్కకూర రసం కొద్దిగా కలుపుకొని తీసుకుంటే కామెర్ల వ్యాధి సోకిన  త్వరగా నయమవుతాయి. ఈ వ్యాధి బారిన పడినవారు ఓ వారం రోజులపాటు చుక్కకూర రసం పాలు కలుపుకొని త్రాగాలి. కామెర్ల బారినుంచి బయటపడతారు. అంతేకాదు, చెవిపోటు ఉన్నవారు ఈ ఆకుకూర చుక్కలను చెవిలో వేసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మరీ ముఖ్యంగా తేలు కాటుకు బలైనవారు అది కుట్టిన చోట చుక్కకూర రసం చుక్కలను పోసినట్టైతే త్వరగా కోలుకుంటారు. తేలు కుట్టగానే ఈ రసం పోయడం వల్ల క్షణాలో ఒంట్లోకి పాకే విషాన్ని అడ్డుకుంటుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Game Changer: రామ్ చరణ్ తప్పించుకోగలడా..?

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…

22 hours ago

Tollywood Exclusive: ప్రభాస్ ‘రాజు’ ని టచ్ చేసేదెవరు..?

Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…

3 days ago

The Rana Daggubati Show Trailer: రానా కొత్త టాక్ షో..సెలబ్రిటీలెవరంటే..

The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…

6 days ago

Bhagyashri Borse: కాస్త అటు ఇటుగా ఆ హీరోయిన్‌లాగే ఉంది..ఎవరూ గుర్తు పట్టలేదు..!

Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…

2 weeks ago

Virinchi Varma: ‘జితేందర్ రెడ్డి’ సినిమా అందుకే చేశాను..

Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…

3 weeks ago

Raashii Khanna: అది నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..?

Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…

4 weeks ago

This website uses cookies.