Health Tips: వర్షాకాలం మొదలవడంతో పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున నీరు నిల్వ ఉంటుంది. అలాగే ఇంటి చుట్టు పరిసర ప్రాంతాలలో పిచ్చి మొక్కలు కూడా అధికంగా పెరుగుతున్న నేపథ్యంలో దోమల ఉధృతి కూడా అధికంగా ఉంది. ఇక వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం వల్ల దోమల ఉత్పత్తి కూడా అధికమవుతుంది తద్వారా పెద్ద ఎత్తున మలేరియా చికెన్ గునియా వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి.
ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ చికెన్ గునియా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు ఎంతోమంది గురి అవుతున్నారు. అయితే ఈ వ్యాధి కారణంగా కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకే ప్రతి ఒక్కరు వర్షాకాలంలో దోమకాటుకు గురి కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా దోమ కాటుకు గురికాకుండా ఉండాలి అంటే మన చుట్టూ పరిసర ప్రాంతాలలో దోమలు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మన ఇంటి పరిసర ప్రాంతాలలో పిచ్చి మొక్కలు ఉంటే తొలగించాలి అలాగే నీరు నిల్వకుండా జాగ్రత్తపడాలి.
మన ఇంటి ఆవరణంలో కుండీలలో కనక పూల మొక్కలను పెంచుతున్నట్లయితే ఆ కుండీలలో కూడా నీరు నిలవకుండా చూసుకోవాలి. అలాగే దోమలు ఇంట్లోకి రాకుండా ఇంట్లో పరిశుభ్రతను పాటించడంతోపాటు కిటికీలు డోర్లకు నెట్ వేయటం ఎంతో ముఖ్యం. ఇక మస్కిటో కాయిల్స్ ఉపయోగించడం వల్ల చిన్న పిల్లలు ఉంటే ప్రమాదం తలెత్తుతుంది. కనుక వీలైనంతవరకు సాంబ్రాణి పొగ కర్పూరం వంటి వాటిని వెలిగించి దోమలు లేకుండా జాగ్రత్తపడాలి. ఇక పడుకునేటప్పుడు తప్పనిసరిగా దోమతెరను ఉపయోగించడం వల్ల ఈ వ్యాధులను మనం అరికట్టవచ్చు. అలాగే మనం తీసుకునే ఆహారం కూడా వేడివేడిగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.