Politics: ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చేసి గట్టిగా ఫైట్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు సాధించుకున్నారు. ఇక ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిన తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రజలు సైతం భారీ ఆధిక్యంతో పట్టం కట్టారు. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ని గద్దె ఎక్కించారు. ఇక తెలంగాణ ప్రజల ఆకాంక్షలని గౌరవించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు అస్సలు గుర్తించలేదు. తాము త్యాగాలు చేసుకుంటేనే తెలంగాణ ఇచ్చారు తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని ప్రజలు భావించారు.
ఈ తెలంగాణ సెంటిమెంట్ తోనే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక అప్పటి నుంచి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. అయితే రెండో సారి ముందస్తు ఎన్నికలకి వెళ్ళడంతో పాటు మరోసారి తెలంగాణ సెంటిమెంట్, ఆంధ్రా నాయకుల పెత్తనం అనే అంశాలని తెరమీదికి తీసుకొచ్చిన కేసీఆర్ సక్సెస్ అయ్యారు. మెజారిటీ తగ్గినా కూడా మళ్ళీ ప్రజలు పట్టం కట్టారు.
అయితే రెండో సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం మరింత తగ్గిపోయింది. బీజేపీ పార్టీకి ప్రజలు కొన్ని అసెంబ్లీ స్థానాలని ఇచ్చారు. దీంతో తెలంగాణలో బలపడటానికి ఉన్న అవకాశాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం కరెక్ట్ గా ఓడిసిపట్టుకుంది. అగ్రిసివ్ గా ఉండే బండి సంజయ్ లాంటి వ్యక్తికి తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించింది. అప్పటి నుంచి మెల్లగా అడుగులు వేసుకుంటూ బీజేపీ పార్టీ ప్రజాబలం పెంచుకోవడం మొదలు పెట్టింది. అదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం, గ్రూప్ రాజకీయాల కారణంగా ప్రజలు ఆ పార్టీని పక్కన పెట్టడం మొదలు పెట్టారు.
టీఆర్ఎస్ తర్వాత రెండో స్థానం బీజేపీకి ఇచ్చేసారు. ఇక రెండు అసెంబ్లీ ఉప ఎన్నికలలో బీజేపీకి పట్టం పట్టారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని వ్యూహాలతో ముందుకెళ్ళిన బీజేపీకే విజయం వరించింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా బీజేపీ సత్తా చూపిస్తూ వచ్చింది. తెలంగాణలో తమకి తిరుగులేదని అనుకుంటున్న టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు బీజేపీ పార్టీ రూపంలో పెద్ద ప్రమాదం వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పొంచి ఉంది. ఈ నేపధ్యంలో కేసీఆర్ తన వ్యూహాలని మార్చుకొని రాష్ట్ర నాయకత్వ బాధ్యతని కేటీఆర్ కి అప్పగించి కేంద్రంలో చక్రం తిప్పాలని ప్రయత్నం మొదలు పెట్టారు. టీఆర్ఎస్ పార్టీ పేరుని బీఆర్ఎస్ గా మార్చేశారు. అయితే బీజేపీ మాత్రం తనకి అలవాటైన రిలీజియన్ సెంటిమెంట్ ని తెలంగాణ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది.
ఒవైసీ లాంటి నాయకుడిని అడ్డుకోవాలంటే బీజేపీతోనే సాధ్యం అవుతుందనే సంకేతాలని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఇక అసలు డిపాజిట్ కూడా రాని స్థాయి నుంచి ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చే స్థాయికి బీజేపీ సత్తా పెంచుకుంది. తాజాగా జరిగిన మునుగోడు ఎన్నికలలో కూడా బీజేపీ పార్టీకి విజయం వరించకున్న ప్రజలు రెండో స్థానం ఇచ్చారు. అదే సమయంలో టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం అనుకున్న కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. దీనిని బట్టి మరో ఏడాదిలోనే ఎన్నికలు ఉన్న నేపధ్యంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వాస పరీక్షలో మళ్ళీ తనని తాను ప్రూవ్ చేసుకొని నమ్మకం పెంచుకోవాలి. లేదంటే ఈ సారి బీజేపీ రూపంలో గండాన్ని ఎదుర్కోక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.